Nagababu: పిఠాపురంలో ( Pithapuram )ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా టిడిపి వర్సెస్ జనసేన అన్నట్టు ఇక్కడ పరిస్థితి ఉంది. పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన ప్రసంగం అభ్యంతరకరంగా ఉంది. నియోజకవర్గ నేత వర్మను అవమానించేలా ఉంది. ఇది ఎంత మాత్రం టిడిపి శ్రేణులకు మింగుడు పడలేదు. అయితే ఇప్పుడు అదే నాగబాబు ఎమ్మెల్సీ హోదాలో పిఠాపురంలో అడుగు పెట్టారు. ఇక్కడ వర్మ కు మద్దతుగా నినాదాలు చేశారు టిడిపి శ్రేణులు. దీనికి జన సైనికులు కూడా కౌంటర్ ఇచ్చారు. దీంతో పిఠాపురంలో మరో రచ్చ కనిపించింది. కానీ ఇరు పార్టీల నేతలు సముదాయించేసరికి పరిస్థితి సద్దుమణిగింది.
Also Read: ఏపీలో 2029లో విజేత వారే.. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈజీ విశ్లేషణ!
* నేరుగా పిఠాపురానికి..
నిన్ననే మెగా బ్రదర్ నాగబాబు( Mega brother Naga babu ) ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన నేరుగా పిఠాపురం నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చేసరికి టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన అనుమానం ప్రారంభం అయింది. ఇది పూర్తిగా రాజకీయ ఆధిపత్యం ప్రదర్శించేందుకేనని అర్థమవుతోంది. నాగబాబు పిఠాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్న క్యాంటీన్ ప్రారంభించారు. అయితే ఇక్కడ వర్మ కు ప్రాధాన్యం దక్కకపోవడంతో టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందుకే నాగబాబు చేపడుతున్న ప్రారంభోత్సవాల్లోనే టిడిపి క్యాడర్ వర్మ కు జై కొట్టింది. దీనికి ప్రతిగా జనసైనికులు సైతం జై జనసేన అంటూ హోరెత్తించారు. దీంతో ఇక్కడ రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు స్పష్టమైనది. వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాకు వార్తగా మారింది.
* వర్మకు అవమానం..
పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కోసం పిఠాపురం సీటు వదులుకున్నారు వర్మ. చంద్రబాబు సముదాయించేసరికి పవన్ గెలుపును తన భుజస్కాంధాలపై వేసుకున్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వర్మకు జనసేన కృతజ్ఞత గానే చూసింది. కానీ తరువాత క్రమేపి మార్పు ప్రారంభమైంది. జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలతో గ్యాప్ పెరిగింది. అదే సమయంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. వర్మపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన నాగబాబుకు ఎమ్మెల్సీ పరుగు దక్కింది. త్వరలో ఆయన మంత్రిగా కూడా ఎంపిక కావడం ఖాయం. అయితే ఈ పరిణామాలన్నీ పిఠాపురం టిడిపి క్యాడర్ లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఆగ్రహం తాజాగా నాగబాబు పర్యటనలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఇక్కడ జనసేన ఇన్చార్జిగా ఉన్న నేతను టిడిపి శ్రేణులు నిలదీసినంత పని చేశాయి. వర్మ చెబితేనే పవన్ కళ్యాణ్ కు ఓటు వేశామని బాహటంగానే వారు తేల్చి చెప్పారు.
* సోషల్ మీడియాలో వీడియోలు..
గత రెండు రోజులుగా పిఠాపురంలో సీన్ మారింది. నాగబాబు పర్యటనతో మరింత వివాదం ముదిరింది. వచ్చే ఎన్నికల్లో వర్మకు( Pithapuram Varma ) పోటీ చేయాలంటూ పిఠాపురం ప్రజలు అడుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది జనసైనికుల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది. టిడిపి శ్రేణులే సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేసినట్లు అనుమానిస్తున్నారు. రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరగడానికి కారణం నాగబాబు. ఇప్పుడు అదే నాగబాబు పిఠాపురం పర్యటన మరింత రచ్చకు దారితీసింది. మున్ముందు ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి.