iPhone 13 : ఐఫోన్లను ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్కెట్లోకి కొత్త మోడల్ వస్తుందంటే చాలు షోరూంల వద్ద కిలో మీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తాయి. ఐఫోన్ ను ప్రస్తుతం కేవలం ఫోన్ గా మాత్రమే కాకుండా స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. iPhone ని తక్కువ ధరకు కొనాలని చూస్తున్నట్లు అయితే ఇదో బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ ఇప్పుడు మీ బడ్జెట్లోనే అందుబాటులో ఉంది. దీని కోసం మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో ఈ ఫోన్ ఏకంగా రూ.16,000 తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్లు,ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read : గెలాక్సీ ఏఐతో శాంసంగ్ సంచలనం.. భారత్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్!
సాధారణంగా iPhone 13 ధర రూ. 59,900 కాగా, ప్రముఖ ఈ-కామర్స్ వేదిక అమెజాన్‌లో ఇది 26 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 43,900 కే లభిస్తోంది. ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించలేని వారికి ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. నెలకు కేవలం రూ. 2,128 ఈఎంఐతో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే సెలక్ట్ చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తే అదనంగా రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్: మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరింత ఎక్కువ తగ్గింపును కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్ మోడల్, పరిస్థితి, బ్యాటరీ కెపాసిటీ పై ఎక్స్ఛేంజ్ విలువ ఆధారపడి ఉంటుంది. అయితే, మంచిగా ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే ఇంకా తగ్గింపు లభించే అవకాశం ఉంది.
కెమెరా, బ్యాటరీ వివరాలు
ఐఫోన్ 13లో ఫోటోలు, వీడియోల కోసం డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రధాన కెమెరా 12 మెగాపిక్సెల్‌తో వస్తుంది. కెమెరాలో నైట్ మోడ్, స్మార్ట్ HDR 4, ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4K HDR వీడియో రికార్డింగ్ (60fps వరకు), సినిమాటిక్ మోడ్ (1080p @30fps) లో వీడియోలను రికార్డ్ చేయవచ్చు.
బ్యాటరీ, ఛార్జింగ్ విషయానికి వస్తే ఆపిల్ కంపెనీ ఎప్పుడూ కూడా తన మోడళ్ల ఖచ్చితమైన బ్యాటరీ సామర్థ్యాన్ని వెల్లడించదు. అయితే కస్టమర్ల రివ్యూ ప్రకారం ఈ మోడల్ బ్యాటరీ విషయంలో చాలా మెరుగ్గా ఉంది. iPhone 13 ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ అనేక కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.