దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం, ఇంటర్నెట్ తక్కువ ధరకే అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో అదే స్థాయిలో చెడు కూడా జరుగుతోంది. ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. కొన్ని కంపెనీలు 5,000 ఇన్వెస్ట్ చేస్తే రోజుకు 500 చొప్పున ఇస్తామని అమాయకపు ప్రజలకు ఆఫర్లు ఇస్తున్నాయి. పొరపాటున ఆఫర్ ను నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం తర్వాత బాధ పడాల్సి ఉంటుంది.
Also Read: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ పని చేస్తే ఫ్రీగా భోజనం..?
ఈ మధ్య కాలంలో ఒక యాప్ అమాయకపు ప్రజలను నమ్మించి ఈ తరహా మోసాలు ఎక్కువగా చేస్తోంది. ఆన్ లైన్ మనీ యాప్ లలో ఒకటైన ఓఎమ్ జీ బర్సీ అనే యాప్ పాపులర్ అవుతోంది. చాలామంది ఈ యాప్ లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే టెక్ నిపుణులు మాత్రం ఈ యాప్ సురక్షితమైనది కాదని చెబుతున్నారు. ఈ యాప్ ఓనర్, ఇతర వివరాలు లేవని.. ఇలాంటి యాప్ లలో ఇన్వెస్ట్ చేయడం, వినియోగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
Also Read: కారు కొనాలనుకునే వాళ్లకు శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్..?
ఇలాంటి యాప్ లు మొదట కొంత మందికి డబ్బులు ఇచ్చినా తరువాత నిలువునా ముంచేస్తాయని ఈ యాప్ చట్టబద్ధమైన యాప్ కాదని నిపుణులు చెబుతున్నారు. అమాయకులను ట్రాప్ చేయడానికి సులభంగా డబ్బు సంపాదించవచ్చంటూ ఆన్ లైన్ లో కంపెనీలు ప్రకటనలు ఇస్తుంటాయని.. ప్లే స్టోర్, యాప్ స్టోర్ లలో అందుబాటులో ఉండని ఏపీకే ద్వారా మాత్రమే డౌన్ లోడ్ చేసుకోగలిగే ఇలాంటి యాప్ లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఈ యాప్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలు సైతం ఆన్ లైన్ లో లేవని .. ఎవరైనా మోసపోయినా మోసానికి పాల్పడిన వాళ్లను పట్టుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నకిలీ యాప్స్ లో పెట్టుబడులు పెట్టడం, బ్యాంక్ ఇతర వివరాలు సమర్పించడం వల్ల ఇబ్బందులు పడాల్సి ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.