https://oktelugu.com/

అల్లరి నరేశ్ కేరీర్ లోనే భారీ పారితోషికం ఆ సినిమాకే..

అల్లరి నరేశ్. కామెడీ హీరోగా తెలుగు తెరకు పరిచయమై మరో రాజేంద్రప్రసాద్ గా పేరు సంపాదించాడు. ఒకప్పుడు వరుస సినిమాలు తీసి హిట్స్ కొట్టి అనంతరం ఫ్లాప్స్ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. తర్వాత మహేష్ బాబుతో కలిసి ‘మహర్షి’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. మహర్షి సినిమాకు సంబంధించి అల్లరి నరేష్ తన జీవితంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్నట్టు తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిజంగా ఇది అల్లరి నరేష్ కెరీర్ లోనే భారీ పారితోషికంగా నిలిచింది. తను హీరోగా నటించే […]

Written By:
  • NARESH
  • , Updated On : December 21, 2020 / 08:45 PM IST
    Follow us on

    అల్లరి నరేశ్. కామెడీ హీరోగా తెలుగు తెరకు పరిచయమై మరో రాజేంద్రప్రసాద్ గా పేరు సంపాదించాడు. ఒకప్పుడు వరుస సినిమాలు తీసి హిట్స్ కొట్టి అనంతరం ఫ్లాప్స్ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. తర్వాత మహేష్ బాబుతో కలిసి ‘మహర్షి’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. మహర్షి సినిమాకు సంబంధించి అల్లరి నరేష్ తన జీవితంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్నట్టు తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిజంగా ఇది అల్లరి నరేష్ కెరీర్ లోనే భారీ పారితోషికంగా నిలిచింది. తను హీరోగా నటించే సినిమాలకు అటుఇటుగా కోటి రూపాయలు తీసుకుంటాడు అల్లరి నరేష్. కొన్ని సినిమాలకు అంతకంటే తక్కువ మొత్తానికి పనిచేసిన సందర్భాలున్నాయి.

    Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నప్రశాంత్ నీల్

    మహర్షి కోసం అల్లరినరేష్ అందుకున్న మొత్తమే అతడి కెరీర్ లోబిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ గా చెప్పుకోవాలి. సుడిగాడు సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయాడు అల్లరి నరేష్, అదే టైమ్ లో మహర్షి మూవీ ఆఫర్ వచ్చింది.

    మహేష్ సినిమా కావడం, క్యారెక్టర్ నచ్చడం , పైగా పారితోషికం కూడా ఎక్కువగా ఉండడంతో వెంటనే ఒప్పుకున్నాడు . ఈ సినిమా సక్సెస్ కావడంతో హీరోగా మళ్లీ మార్కెట్ పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నడు అల్లరోడు.

    Also Read: అఖిల్ తో భారీ రిస్క్ చేస్తున్న ప్లాప్ నిర్మాత !

    మహర్షి సినిమాతోపాటు గిరి డైరెక్షన్ లో ఓ సినిమా కంప్లీట్ చేశాడు అల్లరి నరేష్. గతంలో నందిని నర్సింగ్ హోం అనే సినిమాను డైరెక్ట్ చేసిన గిరి, తన రెండో ప్రయత్నంగా అల్లరి నరేష్ తో కామెడి ఎంటర్ టైనర్ తీశాడు. మహర్షి తర్వాత థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాతో హీరోగా కూడా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాడు అల్లరినరేష్.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్