Mukhesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ & ఎండీ ముఖేష్ అంబానీ భారతదేశంలోనే కాదు. ఆసియాలో కూడా అత్యంత ధనవంతుడు. ముఖేష్ అంబానీ నికర విలువ దాదాపు 116 బిలియన్ డాలర్లుగా అంచనా. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, రిలయన్స్ చైర్మన్ ప్రపంచంలోనే 12వ అత్యంత ధనవంతుడు. అతని తర్వాత, అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ 13వ స్థానంలో ఉన్నారు. భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ గంటకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా ?.. ముకేష్ అంబానీ సంపదను అంచనా వేయడానికి ఒక లెక్క ఉంది. ఒక వ్యక్తి, ప్రతి సంవత్సరం రూ. 4 లక్షలు సంపాదిస్తాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ప్రస్తుత సంపద స్థాయిని చేరుకోవడానికి అతనికి 1.74 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం.
గతంలో ముఖేష్ అంబానీ ప్రతి సంవత్సరం సుమారు 15 కోట్ల జీతం పొందేవాడు. కానీ, అతను కరోనా నుండి జీతం తీసుకోకుండా పనిచేస్తున్నాడు. అతను రోజుకు సగటున రూ. 163 కోట్లు సంపాదిస్తున్నాడు. అతను గంటకు దాదాపు 6.80 కోట్లు సంపాదిస్తున్నాడు. అంటే, అంబానీ తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నప్పటికీ అతని సంపద విలువ ప్రతి గంటకు 6.80 కోట్లు పెరుగుతుంది. కరోనా కాలం నుండి జీతం లేకపోతే అంబానీకి అంత డబ్బు ఎలా వస్తుందని ఆలోచిస్తున్నారా. ఈ డబ్బు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోని షేర్ల నుండి అతనికి వస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోకెమికల్స్, చమురు, టెలికాం, రిటైల్ వంటి అనేక రంగాలలోకి విస్తరించింది, డజన్ల కొద్దీ వ్యాపారాలను కలిగి ఉంది. దీనితో పాటు, ముఖేష్ అంబానీ ముంబైలోని తన సొంత ఇల్లు ఆంటిలియాతో సహా రియల్ ఎస్టేట్‌లో చాలా పెట్టుబడి పెట్టారు. ఆంటిలియా విలువ దాదాపు రూ. 15,000 కోట్లు ఉంటుందని అంచనా.
2020 నాటికి ముఖేష్ అంబానీ గంటకు సగటున రూ. 90 కోట్లు సంపాదిస్తున్నాడు. అంటే, రోజుకు రూ. 2,160 కోట్ల ఆదాయం. మరోవైపు, భారతదేశంలో దాదాపు 24 శాతం మంది నెలకు రూ. 3000 మాత్రమే సంపాదించగలుగుతున్నారు. అంబానీ కుటుంబ కార్యక్రమాలు కూడా వారి హోదాకు తగిన విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం, ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం కోసం దాదాపు రూ. 5000 కోట్లు ఖర్చు చేసి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు. అంత సంపాదన ఉన్నా ముఖేష్ అంబానీ దానం చేయరన్న టాక్ ఉంది. ఈ విషయమై ఓ కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ఓ స్వామీజీ వచ్చి ఇంత సంపాదిస్తున్నా నువ్వు ఎందుకు దానం చేయవని అడిగారు. నువ్వు ఇంత సంపాదించినా చనిపోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా నీ వెంట తీసుకుని పోలేవని స్వామీజీ అన్నారట. దీంతో ముఖేష్ అంబానీ ఆలోచనలో పడ్డారట.
ఆ వెంటనే తన కార్మికులను పిలిచి నేను చనిపోయిన తర్వాత నాతో పాటు ఈ సంపద అంతా తీసుకుని పోయే విధంగా ప్లాన్ చెప్పిన వాళ్లకు పది లక్షలు ఇస్తానన్నారట. దీంతో చాలా మంది ఇదేం పిచ్చి ఆలోచన అనుకున్నారట. అలా చేయలేమని కార్మికులు మనసులో అనుకుని సైలెంట్ గా ఉండిపోయారట. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మరోసారి కార్మికులతో ఆ ఐడియా చెప్పిన వాళ్లకు ఈ సారి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారట. దీంతో ఓ వ్యక్తి నేను ఐడియా చెబుతానని అంబానీ వద్దకు వచ్చాడట. ఫైనల్ గా ఓ వ్యక్తి దొరికాడని సంతోషించాడట. వెంటనే ఆ వ్యక్తి అంబానీతో నువ్వు ఎప్పుడైనా అమెరికా వెళ్లావా అని అడిగాడట.. వెళ్లాను అని అంబానీ చెప్పాడు. అప్పుడు కరెన్సీ ని ఏం చేశావంటే డాలర్లుగా మార్చుకున్నా అని సమాధానం ఇచ్చాడట. అలా నువ్వు స్వర్గంలోకి వెళ్లే టప్పుడు అక్కడ కూడా ఓ కరెన్సీ ఎక్స్ చేంజ్ ఉంటుంది. భూమీ మీద నువ్వు చేసిన పాపపుణ్యాలు నువ్వు పైలోకానికి వెళ్లిన తర్వాత ఎక్స్ ఛేంజ్ అవుతాయని చెప్పాడట. అదే నువ్వు తీసుకెళ్లే కరెన్సీ అని తెలిపాడట.