https://oktelugu.com/

Health Insurance : రూ.15,100 కోట్ల విలువైన క్లెయిమ్‌లను తిరస్కరించిన బీమా కంపెనీలు… అసలు హెల్త్ ఇన్సురెన్స్ తీసుకుంటే డబ్బులు వస్తాయా ?

బకాయి క్లెయిమ్‌ల మొత్తం రూ.7 వేల 584.57 కోట్లు (6.48 శాతం) అని కూడా నివేదికలో పేర్కొంది. 2023-24లో బీమా కంపెనీలు దాదాపు 3.26 కోట్ల హెల్త్ ఇన్సురెన్స్ క్లెయిమ్‌లను అందుకున్నాయి. ఇందులో 2.69 కోట్ల (82.46 శాతం) క్లెయిమ్‌లను పరిష్కరించారు.

Written By:
  • Rocky
  • , Updated On : December 30, 2024 / 09:42 PM IST

    Health Insurance Claim

    Follow us on

    Health Insurance : ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా తప్పనిసరి. మధ్యతరగతి ప్రజలకు ఏ సమస్య వచ్చినా పెద్ద ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకునేంత స్థోమత లేదు. అందుకే.. తమ సంపాదనలో ఎంతో కొంత పెట్టి బీమా తీసుకుంటున్నారు. అయితే.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా.. ఆరోగ్య బీమా ప్రీమియం కూడా ఏటా పెరుగుతూ వస్తోంది. హెల్త్ బీమా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. 2023-24 సంవత్సరంలో రూ.15,100 కోట్ల విలువైన క్లెయిమ్‌లను కంపెనీలు తిరస్కరించినట్లు ఒక నివేదిక వెల్లడించింది. కంపెనీలు మొత్తం 12.9 శాతం క్లెయిమ్‌లను తిరస్కరించాయి. రూ.1.17 లక్షల కోట్ల క్లెయిమ్‌లలో రూ.83 వేల 493.17 కోట్లు చెల్లించారు. IRDAI (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) నివేదిక-2023-24 ప్రకారం, హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీల కింద 2024లో రూ. 1.17 లక్షల కోట్ల క్లెయిమ్‌లలో రూ. 83 వేల 493.17 కోట్లు లేదా 71.29 శాతం చెల్లించబడింది. 10 వేల 937.18 కోట్ల విలువైన క్లెయిమ్‌లను బీమా కంపెనీలు తిరస్కరించాయి.

    72 శాతం క్లెయిమ్‌లు
    బకాయి క్లెయిమ్‌ల మొత్తం రూ.7 వేల 584.57 కోట్లు (6.48 శాతం) అని కూడా నివేదికలో పేర్కొంది. 2023-24లో బీమా కంపెనీలు దాదాపు 3.26 కోట్ల హెల్త్ ఇన్సురెన్స్ క్లెయిమ్‌లను అందుకున్నాయి. ఇందులో 2.69 కోట్ల (82.46 శాతం) క్లెయిమ్‌లను పరిష్కరించారు. క్లెయిమ్‌కు సగటున రూ.31 వేల 86 చెల్లించినట్లు ఇర్డా తెలిపింది. 72 శాతం క్లెయిమ్‌లు TPAల (థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేటర్‌లు) ద్వారా పరిష్కరించబడ్డాయి.

    28 శాతం క్లెయిమ్‌లు ఇంటర్నల్ సిస్టమ్ ద్వారా పరిష్కరించబడ్డాయి. 66.16 శాతం క్లెయిమ్‌లు క్యాష్‌లెస్ మోడ్ ద్వారా చేయబడ్డాయి. మిగిలిన 39 శాతం రీయింబర్స్‌మెంట్ చేయబడ్డాయి. సాధారణ, హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీలు 2023-24లో ప్రమాదాలు , ప్రయాణాలు, బీమా ప్రీమియంలు మినహా ఆరోగ్యం కింద రూ.1,07,681 కోట్లు వసూలు చేశాయి. గతేడాది కంటే ఇది దాదాపు 20.32 శాతం ఎక్కువ.

    57 కోట్ల మందికి హెల్త్ ఇన్సురెన్స్
    ప్రమాద, ప్రయాణ బీమా కింద జారీ చేసిన పథకాలతో పాటు బీమా కంపెనీలు 57 కోట్ల మందిని 2.68 కోట్ల ఆరోగ్య బీమా పథకాల కింద కవర్ చేశాయి. మార్చి 2024 చివరి నాటికి 25 జనరల్ హెల్త్ ఇన్సురెన్స్, 8 సింగిల్ హెల్త్ ఇన్సురెన్స్ సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు న్యూ ఇండియా, నేషనల్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ విదేశాల్లో హెల్త్ ఇన్సురెన్స్ బిజినెస్ చేస్తున్నాయి.

    వారు 2023-24లో ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాదాలు, ప్రయాణ బీమా నుండి రూ. 154 కోట్ల ప్రీమియం వసూలు చేశారు. 10.17 లక్షల మందికి కవర్ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో బీమా పరిశ్రమ 165.05 కోట్ల మందికి వ్యక్తిగత ప్రమాద బీమా పరిధిలోకి వచ్చింది. ఇందులో 90.10 కోట్ల మంది ప్రజలు ఇ-టికెట్ ప్రయాణీకుల కోసం ప్రభుత్వ ప్రధాన పథకాలైన ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, IRCTC ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేశారు.