Game changer Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు UA సర్టిఫికేట్ ని జారీ చేసారు. సినిమా నిడివి రెండు గంటల 45 నిమిషాలు మాత్రమే. సినిమాలో హీరో నుండి, ఇతర క్యారక్టర్స్ నుండి వచ్చిన కొన్ని బూతులు మినహా, ఎక్కువగా కట్స్ విధించకుండా ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ని ఇచ్చారు. ఈ సినిమాని చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు మూవీ టీం ని ప్రశంసలతో ముంచి ఎత్తినట్టు తెలుస్తుంది. ఈమధ్య కాలం లో సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు చాలానే వచ్చాయి, కానీ వాటిల్లో సోషల్ ఎలిమెంట్స్ ఉంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే, సోషల్ మెసేజ్ ఎలిమెంట్స్ సరిగా హైలైట్ అవ్వవు. ఈ రెండిటిని బ్యాలన్స్ చేసి నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టు సినిమాలు తియ్యడం లో విఫలం అయ్యారు మన డైరెక్టర్స్.
అయితే ‘గేమ్ చేంజర్’ చిత్రం ఆ రెండిటిని బ్యాలన్స్ చేస్తూ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు సెన్సార్ సభ్యుల నుండి వచ్చిన టాక్. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరో ఇంట్రడక్షన్ సన్నివేశం, సాంగ్స్ చిత్రీకరణ, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పించేలా ఉంటుందట. ఒకప్పుడు శంకర్ సినిమాలు ఎలా ఉండేవో, అలా ఈ చిత్రం టైటిల్ కార్డు దగ్గర నుండే ఉంటుందట. రామ్ నందన్ గా రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడని, ఆయన కెరీర్ లో ది బెస్ట్ రోల్స్ లో ఒకటిగా ఈ పాత్ర నిలుస్తుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ లో వచ్చిందని టాక్. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రామ్ చరణ్ ఆపన్న క్యారక్టర్ అద్భుతంగా పేలిందట.
ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ చూపించిన ఎమోషన్స్ కి కంటతడి పెట్టని వాడంటూ ఎవ్వరూ ఉండరని అంటున్నారు. అంత అద్భుతంగా చేసాడట. ఫ్లాష్ బ్యాక్ తర్వాత విలన్ ఎస్ జె సూర్య తో వచ్చే రామ్ చరణ్ కాంబినేషన్ సన్నివేశాలు, అదే విధంగా క్లైమాక్స్ ఎపిసోడ్ అన్ని వేరే లెవెల్ లో వచ్చాయని, రామ్ చరణ్, శంకర్ పోటీ పడి మరీ తమ బెస్ట్ ఇచ్చారని సెన్సార్ సభ్యుల నుండి వినిపిస్తున్న టాక్. ఈ సినిమాని చూసిన తర్వాత వాళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ లో ఈ ప్రోడక్ట్ వచ్చిందో. ఇందులో రామ్ చరణ్ ఒక కాలేజీ స్టూడెంట్ గా, పోలీస్ ఆఫీసర్ గా, IAS ఆఫీసర్ గా, ఎలక్షన్ ఆఫీసర్ గా, ఆ తర్వాత ఏకంగా సీఎంగా ఎదిగేందుకు మధ్యలో జరిగిన ప్రయాణం మొత్తాన్ని డైరెక్టర్ శంకర్ తన దర్శకత్వ ప్రతిభతో అద్భుతంగా చూపించారని తెలుస్తుంది. మరి సెన్సార్ లో వచ్చిన ఈ టాక్ నిజం అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరో 12 రోజులు ఆగాల్సిందే.