https://oktelugu.com/

Infosys : ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఐటీ ఉద్యోగులకు సంకటమేనా?

ఇక ఇన్ఫోసిస్ తన కొత్త నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టు లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ లాట్, నాలెడ్జ్ బెస్ట్ ఇంజనీరింగ్, స్మార్ట్ ప్లేస్ లో వంటి రంగాలను ఒకే గొడుగు పైకి తీసుకువచ్చింది. దీనికి తగ్గట్టుగా ఉద్యోగులు తమ పని విధానాలను మార్చుకోవాలని సూచించింది.. ఇక లే ఆఫ్ విధానం అమలవుతున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంటుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 3, 2024 / 09:55 PM IST

    Infosys key decision.. Danger bells for IT employees

    Follow us on

    Infosys : గత కొద్ది సంవత్సరాలుగా ఐటి పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కోవిడ్ సమయంలో అద్భుతమైన ప్యాకేజీలతో, ఇంటి వద్ద నుంచే పని చేసే అవకాశం తో ఐటీ ఉద్యోగులు పండగ చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోయి చాలామంది ఇబ్బంది పడుతుంటే.. వారు ఐదు నుంచి 6 అంకెల జీతాన్ని వెనకేసుకున్నారు. ఎప్పుడైతే కోవిడ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయో.. అప్పటినుంచి ఐటీ ఉద్యోగులకు రోజూ గండమే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో లే ఆఫ్ తెరపైకి వచ్చింది. దీంతో కంపెనీలో ఉద్యోగులను అడ్డగోలుగా తొలగిస్తున్నాయి. ఇప్పటికే మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఇక మనదేశంలో కూడా అలాంటి పరిస్థితే ఉంది.

    ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ లే ఆఫ్ నేపథ్యంలో సరికొత్త నిర్ణయం తీసుకుంది. దీంతో ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రాజెక్ట్ లలో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం ఇన్ పర్సన్ కొల్లాబ్ వీక్స్ విధానాన్ని అమలు చేస్తోంది. విధానం ప్రకారం ప్రాజెక్టులలో పనిచేసే ఉద్యోగులు సంస్థ నిర్ణయించిన వారాల్లో సంబంధిత క్యాంపస్ లకు హాజరు కావలసి ఉంటుంది. స్థూలంగా మన పారిభాషలో చెప్పాలంటే ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా వార్తల ప్రకారం ఇన్ఫోసిస్ ఉద్యోగులు నెలలో పది రోజులు కార్యాలయం నుంచి కచ్చితంగా పనిచేయాల్సిన నిబంధన అమలు కానుంది.. ఇప్పటికే మెయిల్స్ ద్వారా సంస్థ ఈ విషయాన్ని ఉద్యోగులకు తెలిపింది.. ఫలితంగా ఇది వెలుగులోకి వచ్చింది. ఈ విధానం కంటే ముందు ఇన్ఫోసిస్ హైబ్రిడ్ వర్క్ పాలసీని తెరపైకి తీసుకువచ్చింది. దీని ప్రకారం ప్రతి ఒక్క ఉద్యోగి నెలలో పది రోజుల్లో చొప్పున క్వార్టర్లో 30 రోజులపాటు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ఇలా ఉద్యోగులను కార్యాలయానికి రప్పించడం ద్వారా టీం వర్క్ పెరుగుతుందని, ఉత్పాదకత పెంపొందుతుందని ఇన్ఫోసిస్ బాధ్యులు చెబుతున్నారు.

    ఇక కొల్లాబ్ వీక్స్ లో పాల్గొనే ఉద్యోగుల సంఖ్యపై ఇన్ఫోసిస్ స్పష్టమైన ప్రకటన చేయలేదు.. పది రోజుల వర్క్ ఫ్రం ఆఫీస్ నిబంధన పై ఇప్పటికే మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఉద్యోగులు దీనిని సమర్థిస్తుంటే.. మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. క్యాంపస్ హాజరు పెంచడం వల్ల ఆఫీస్ టర్నింగ్ పెరుగుతుందని.. క్రమబద్ధమైన మెరుగుదల సాధ్యమవుతుందని ఇన్ఫోసిస్ బాధ్యులు భావిస్తున్నారు. వ్యాపార వృద్ధి తోపాటు, ఉద్యోగుల మధ్య స్నేహ పూరితమైన వాతావరణం, ఆవిష్కరణల పెంపుదలకు ఈ విధానం సహకరిస్తుందని ఇన్ఫోసిస్ మానవ వనరుల విభాగం అధిపతులు అభిప్రాయపడుతున్నారు.

    ఇక ఇన్ఫోసిస్ తన కొత్త నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టు లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ లాట్, నాలెడ్జ్ బెస్ట్ ఇంజనీరింగ్, స్మార్ట్ ప్లేస్ లో వంటి రంగాలను ఒకే గొడుగు పైకి తీసుకువచ్చింది. దీనికి తగ్గట్టుగా ఉద్యోగులు తమ పని విధానాలను మార్చుకోవాలని సూచించింది.. ఇక లే ఆఫ్ విధానం అమలవుతున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంటుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు.