SG fin survey company : స్వల్ప కాలంలో ధనవంతులు కావాలనుకునేవారు ఇటీవల స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనుగోలు చేస్తున్నారు.. అయితే దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టిన వారిలాగా స్వల్పకాలిక మదుపరులు లాభాలు సాధించలేరు. అయితే ఇందులో తెలివైన మదుపరులు మాత్రం ఫండమెంటల్స్ ఉండే మల్టీ బ్యాగర్స్ ను వెతికి పట్టుకుంటున్నారు. అందులో ఇన్వెస్ట్ చేసి ధనవంతులుగా మారిపోతున్నారు..
ఇటీవల స్వల్పకాలిక పెట్టుబడిదారులను శ్రీమంతుడిగా మార్చింది ఎస్ జీ ఫిన్ సర్వ్ కంపెనీ.(SG fin survey company). ఈ స్టాక్ తన ఇన్వెస్టర్లకు గత నాలుగు సంవత్సరాల లో తిరుగులేని మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందించింది. 2020 మార్చిలో ఈ కంపెనీకి సంబంధించిన షేర్ ధర ఒక్కోటి 2.8 రూపాయలుగా ఉండేది. ప్రస్తుతం దీని ప్రారంభ ధర 429 నుంచి 440 వద్ద కొనసాగుతోంది. అంటే ఇటీవల కాలంలో ఈ కంపెనీ తన షేర్లపై పెట్టుబడులు పెట్టిన వారికి ఏకంగా 16,000 లాభం అందించింది.
ఈ ప్రకారం ఎవరైనా ఇన్వెస్టర్ మార్చి 2020లో ఆ కంపెనీకి సంబంధించి షేర్లలో లక్ష వరకు పెట్టుబడిగా పెట్టి ఇప్పటివరకు కొనసాగించినవారు కోటీశ్వరులయ్యారు. ఎందుకంటే లక్ష పెట్టుబడి విలువ ప్రస్తుతం షేర్ మార్కెట్ విలువ ప్రకారం 1.52 కోట్లకు చేరుకుంది. అయితే 2024లో ఏడాది ప్రాతిపదికన తీసుకుంటే 12 శాతం ఈ షేర్ క్షీణతకు గురైంది. వరుసగా రెండు నెలలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంది. తర్వాత ఏప్రిల్ నెలలో మొదటి సెషన్ లో ఈ కంపెనీ స్టాక్ 5 శాతానికి పెరిగింది. ఏడాది మార్చిలో తొమ్మిది శాతం, ఫిబ్రవరి నెలలో 10 శాతం క్షీణతను నమోదుచేసింది. గత ఏడాది జనవరిలో ఈ కంపెనీ షేర్ ధర 2.8% పెరిగింది. ప్రస్తుతం 429 నుంచి 450 మధ్య ట్రేడ్ అవుతోంది. గత ఏడాది మే 26న ఈ స్టాక్ ఆల్ టైం గరిష్ట స్థాయి ధర ₹748కు చేరుకుంది. ఇదే క్రమంలో స్టాక్ 52 వారాల కనిష్ట ధర 384.95 వద్ద కొనసాగుతోంది. ఇక మధ్యాహ్నం సమయంలో స్టాక్ ధర ఇంట్రాడేలో 428.40 వద్ద కొనసాగుతోంది.
SG fin serves limited company బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్, ఆన్ లైన్ ట్రేడింగ్, ఫండ్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ విభాగాలలో సేవలందిస్తోంది. ఈ కంపెనీని గతంలో ముంగిపా సెక్యూరిటీస్ లిమిటెడ్ అని పిలిచేవారు. ఈ కంపెనీని 1994 లో స్థాపించారు. ఇన్వెస్టర్లకు భారీగా లాభాలు అందిస్తున్న నేపథ్యంలో ఈ కంపెనీ కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. మరి కొద్ది రోజులు ఈ కంపెనీ షేర్ ధర ఇలాగే దూకుడుగా ఉంటుందని బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి..(ఈ కథనం మాకు అందిన సమాచారం మేరకు మీకు అందించాం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకొని ఉన్నవి కాబట్టి.. మీకున్న అవగాహన మేరకే షేర్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది)