Canada Vs India(1)
India vs Canada: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్ కెనడా మధ్య సంబంధాలు మరింత పలుచబడ్డాయి. భారత్ కు సంబంధించి సీక్రెట్ ఏజెంట్స్ ఈ హత్య చేశారని కెనడా ఒకసారి ఆరోపిస్తోంది. మరోసారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో నిజ్జర్ ను హత్య చేశారని చెప్తోంది. అయితే దేనికైనా సాక్షాలు ఇవ్వాలని భారత్ కోరుతోంది. ఇరు దేశాల మధ్య యూఎస్ దూరి భారత్ కెనడా ఇన్వెస్టిగేషన్ కు సహకరించాలని కోరుతుంది. అయితే నిజ్జర్ మత్యకు తమకు సంబంధం లేదని భారత్ మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉంది. మొన్నటికి మొన్న సింగాపూర్ లో ఎన్ఐఏ అధికారి దోవల్, కెనడా విదేశాంగ మంత్రితో జరిపిన చర్చల్లో సైతం నిజ్జర్ హత్యలో భారత్ ఇన్వాల్వ్ మెంట్ లేదని చెప్పింది. ఇలా రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఇరు దేశాల మధ్య భారీ వ్యాపార భాగస్వామ్యం ఉన్నా కూడా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు సరికదా పెరుగుతున్నయి. ఇరు దేశాల మధ్య ఈ ఉద్రిక్తత పెరగడంతో వాటి మధ్య వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కెనడియన్ పెన్షన్ ఫండ్ కు పెట్టుబడి పెట్టిన ఆ కంపెనీల టెన్షన్ పెరుగుతోంది. వీటిలో కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో వరకు ఉన్నాయి.
ఈ రంగాల్లో భారత్ పెట్టుబడులు
కెనడా పెన్షన్ ఫండ్స్ లో భారత్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. దేశంలోని అనేక అతిపెద్ద కంపెనీల్లో దీనికి బలమైన వాటా ఉంది. సీపీపీఐబీ దేశంలో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, ఐటీ, ఆర్థిక సేవల కంపెనీల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. కోటక్ బ్యాంకులో రూ. 6141.6 కోట్లు, జొమాటోలో కెనడియన్ పెన్షన్ ఫండ్ రూ. 2,778.1 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. వీటితో పాటు ఢిల్లీవేరీ లిమిటెడ్, ఎఫ్ఎస్ఎన్ ఈ-కామర్స్ వెంచర్స్ లిమిటెడ్ లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు.
ఈ కంపెనీల్లో కూడా పెన్షన్ ఫండ్ డబ్బులు ఇన్వెస్ట్!
కెనడా పెన్షన్ ఫండ్స్ అనేక ఇతర భారతీయ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయని, ఈ జాబితాలో ఆన్ లైన్ పేమెంట్ సేవల దిగ్గజం పేటీఎం, నైకా, ఇండస్ టవర్ తో సహా అనేక పేర్లు ఉన్నాయని నివేదికలో తెలిపింది. ఏదేమైనా, కెనడా, భారత్ దౌత్య ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, కెనడియన్ ఫండ్స్ సెప్టెంబర్ 30, 2024 నాటికి సుమారు రూ. 1.98 లక్షల కోట్ల విలువైన దేశీయ ఈక్విటీలను కలిగి ఉన్నాయి. ఈ సంఖ్యను పరిశీలిస్తే, సీపీపీఐబీ ప్రస్తుతానికి నిష్క్రమించేందుకు తొందరపడడం లేదని తెలుస్తోంది. ఏడాదిగా భారత స్టాక్స్ లో తన వాటాను తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గతేడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం కెనడాలో 30కి పైగా భారతీయ సంస్థలు ఉనికిని కలిగి ఉన్నాయని, దేశంలో అవి పెట్టిన పెట్టుబడి విలువ రూ. 40,446 కోట్లు. ఈ కంపెనీల ద్వారా 17 వేల మందికి పైగా ఉపాధి పొందారు. ఈ కంపెనీల ఆర్ అండ్ డీ వ్యయం కూడా 700 మిలియన్ డాలర్లుగా ఉంది.
నివేదిక ప్రకారం, సుమారు 600 కెనడియన్ కంపెనీలు దేశంలో తమ వ్యాపారాన్ని చేస్తున్నాయి. దిగుమతి, ఎగుమతుల గురించి మాట్లాడితే, ఇరు దేశాల మధ్య పెద్ద వ్యాపారం ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్-కెనడా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య 8.3 బిలియన్ డాలర్లు కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 8.4 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.70,611 కోట్లు) పెరిగింది. కెనడా నుంచి భారత్ కు దిగుమతులు 4.6 బిలియన్ డాలర్లకు పెరగ్గా, ఎగుమతులు స్వల్పంగా తగ్గి 3.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
asiapacific.ca నివేదిక ప్రకారం, 2013 నుంచి 2023 వరకు, దేశంలో కెనడియన్ పెన్షన్ ఫండ్ పెట్టుబడుల్లో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ (3.8 బిలియన్ సి $ కంటే ఎక్కువ), ఆర్థిక సేవలు (3 బిలియన్ సి $ 3 బిలియన్లకు పైగా), పారిశ్రామిక రవాణా (సుమారు 2.6 బిలియన్ సి $ ) లో ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన రంగంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు.
దేనిపై వ్యాపారం చేస్తారు..?
రెండు దేశాల మధ్య దిగుమతి, ఎగుమతి చేసే వస్తువుల గురించి తెలుసుకుంటే కెనడా రత్నాలు, ఆభరణాలు, విలువైన రాళ్లు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, రెడీమెడ్ గార్మెంట్స్, మెకానికల్ అప్లయెన్సెస్, ఆర్గానిక్ కెమికల్స్, లైట్ ఇంజినీరింగ్ గూడ్స్, ఐరన్ అండ్ స్టీల్ భారత్ నుంచి కెనడాకు ఎగుమతి చేస్తే.. కెనడా నుంచి కాగితం, కలప గుజ్జు, ఆస్బెస్టాస్, పొటాష్, ఐరన్ స్క్రాప్, రాగి, ఖనిజాలు, పారిశ్రామిక రసాయనాలను భారత్ దిగుమతి చేసుకుంటుంది.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: India vs canada india vs canada which companies are worried because of the dispute
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com