Digital Payments : నగదు రహిత లావాదేవీల్లో దూసుకుపోతున్న భారత్‌.. చరిత్ర తెలిస్తే గూస్‌ బంప్స్‌ పక్కా..!

ఒకప్పుడు బయటకు వెళ్తే జేబులో పర్సు ఉండాల్సిందే. కానీ నేడు పర్సు మర్చిపోయినా ఇబ్బంది లేదు. స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంటే చాలు. ఎంత పెద్ద షాపింగ్‌ అయినా ఈజీగా చేయొచ్చు.

Written By: Raj Shekar, Updated On : August 16, 2024 11:32 am

Cashless transactions in india

Follow us on

Digital Payments :  నగదు రహిత లావాదేవీల్లో భారత్‌ దూసుకుపోతోంది. 2016, నవంబర్‌ 8న అర్ధరాత్రి కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసింది. దీంతో నగదు కోసం చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగానే కేంద్రం నగదు రహిత సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందు కోసం యూపీఐ యాప్స్‌కు అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి ప్రారంభమైన యూపీఐ పేమెంట్స్‌ క్రమంగా దేశంలో పెరుగుతూ వచ్చాయి. యూపీఐ ద్వారా రోజుకు రూ.లక్ష వరకు ట్రాన్సాక్షన్‌ చేయవచ్చు. ఇందుకు ఎలాంటి చార్జీలు లేకపోవడంతో చాలా మంది యూపీఐలతోనే చెల్లింపులు చేస్తున్నారు. చాయ్‌ బిల్లు నుంచి బంగారం కొనుగోలు వరకు యూపీఐ ద్వారానే ట్రాన్సాక్షన్‌ చేస్తున్నారు. 2016కి ముందు ఇలా ఉండేది కాదు. ఎప్పుడూ కూడా జేబులో డబ్బులు పెట్టుకొని తిరగాల్సి వచ్చేది. అప్పటి వరకు ఆన్‌లైన్‌ చెల్లింపుల గురించి తెలియదు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్సేస్‌(యూపీఐ) వచ్చాక చెల్లింపుల తీరు పూర్తిగా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సిస్టం కొనసాగుతోంది. ఇప్పుడు చాలా దేశాల్లో మనం నగదు మార్పిడి లేకుండా యూపీఐ ద్వారా సులభంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. ప్రపంచ స్థాయిలో భారతదేశానికి గుర్తింపుగా మారింది. ఇది ఆర్థిక లావాదేవీలను పూర్తిగా మార్చివేసింది. డిజిటల్‌ చెల్లింపులలో కొత్త శకానికి నాంది పలికింది.

గతంలో బ్యాంకుల ద్వారా..
గతంలో ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేయడానికి చాలా సమయం పట్టేది. అదే సమయంలో ఇప్పుడు కొన్ని నిమిషాల్లో సులభంగా నగదు బదిలీ అవుతుంది. యూపీఐ లావాదేవీలను చాలా వరకు సులభతరం, సురక్షితంగా చేసింది. పెట్టుబడిదారుడిగా యూపీఐ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. యూపీఐ భారతదేశంలో ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో కూడా బ్యాంకింగ్‌ సేవలను పొందడం సాధ్యమవుతుంది. ఇది వ్యాపారం, ఆర్థిక వ్యవస్థను పెంచింది. చిన్న వ్యాపారులు కూడా దీని నుంచి బాగా లాభపడ్డారు. నల్లధనం, నగదు వినియోగాన్ని కూడా తగ్గించింది. తద్వారా పారదర్శకత, ఆర్థిక స్థిరత్వం మెరుగుపడింది.

2016 నుంచి ప్రారంభం..
యూపీఐ 2016లో ప్రారంభమైన యూపీఐల వినియోగం కరోనా సమయంలో మరింత పెరిగింది. 2021లో మార్కెట్‌ వాటా పెరిగింది. 2016–2017 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ ద్వారా 36 శాతం చెల్లింపులు జరిగాయని అధికారిక సమాచారం. అదే సమయంలో 2021 నాటికి 63 శాతానికి చేరుకుంది. 5 ఏళ్లలో యూపీఐ ప్రజల్లో తనదైన ముద్ర వేసుకుందని ఇది స్పష్టంగా తెలియజేస్తోంది. యూపీఐ అతి పెద్ద లక్షణం ఏమిటంటే ఇది ఏదైనా బ్యాంక్‌ ఖాతాను ఒకే ప్లాట్ ఫామ్ కనెక్ట్‌ చేయడం ద్వారా పని చేస్తుంది. దీని ద్వారా మీరు మొబైల్‌ నంబర్‌ లేదా వర్చువల్‌ పేమెంట్‌ అడ్రస్‌ని ఉపయోగించి తక్షణమే డబ్బును బదిలీ చేయవచ్చు లేదా స్వీకరించవచ్చు. నేడు చిన్న దుకాణదారులు, పెద్ద వ్యాపారవేత్తలు కూడా యూపీఐ ద్వారా లావాదేవీలు చేయడానికి ఇష్టపడతారు.

డిజిటల్‌ లావాదేవీల్లో అగ్రగామిగా..
భారతదేశాన్ని డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించింది. నేడు కోట్లాది మంది ప్రజలు ఏ బ్యాంకు శాఖను సందర్శించకుండానే తమ స్మార్ట్‌ ఫోన్ల ద్వారా చెల్లింపులు చేయడానికి యూపీఐని ఉపయోగిస్తున్నారు. డిజిటల్‌ చెల్లింపులను చాలా సరళంగా, అందుబాటులోకి తెచ్చింది. ఇది నగరాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున అవలంబిస్తోంది. యూపీఐ కూడా ప్రపంచ స్థాయిలో భారతదేశానికి కొత్త గుర్తింపును ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఇప్పుడు యూపీఐ మోడల్‌ను స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ చొరవ భారతదేశాన్ని డిజిటల్‌ లావాదేవీలలో అగ్రగామి దేశంగా నిలబెట్టింది. ఇది దేశ పురోగతి, అభివృద్ధికి చిహ్నంగా కూడా మారింది. డిజిటల్‌ యుగంలో దేశాన్ని కొత్త దిశలో తీసుకెళ్తున్న భారతదేశపు కొత్త గురింపుకు చిహ్నం కూడా.