https://oktelugu.com/

Nithini : నితిన్ కోసం రెడీ చేసిన ఆ సూపర్ హిట్ సినిమా లోకి అల్లు అర్జున్ ఎలా వచ్చాడంటే..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలు మంచి విజయాలను అందుకోవడానికి వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక అందులో భాగంగానే స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలను చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 16, 2024 / 11:23 AM IST

    Nithin and Allu arjun

    Follow us on

    Nithini :  సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాలు మరొక హీరో చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. మొదట దర్శకుడు ఒక హీరోని ఊహించుకొని కథ రాసుకుంటాడు. కానీ ఆ హీరో కి ఆ కథ నచ్చకపోవడం వల్ల గాని, లేదంటే డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం వల్ల గాని ఆ హీరో ఏదో ఒక కారణం చేత ఆ సినిమాను మిస్ చేసుకుంటాడు.దాంతో ఆ కథలోకి దర్శకుడు అనుకున్న హీరో కాకుండా మరొక హీరో వచ్చి చేరుతుంటాడు. ఇలాంటి సందర్భాలు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే కెరియర్ స్టార్టింగ్ లో మంచి విజయాలతో సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న నితిన్ లాంటి స్టార్ హీరో చేయాల్సిన ఒక సినిమాని స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ చేశారనే విషయం మనలో చాలా మందికి తెలియదు. కరుణాకరన్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన హ్యాపీ సినిమాని మొదట కరుణాకరన్ నితిన్ తో చేయాలని అనుకున్నారట. కానీ అప్పుడు నితిన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాని చేయలేకపోయాడు. దాంతో కరుణాకరన్ అల్లు అర్జున్ ను హీరోగా పెట్టి ‘ హ్యాపీ’ సినిమా చేశాడు.

    ఇక ఈ సినిమా కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ సాధించనప్పటికీ అల్లు అర్జున్ కి నటుడిగా మాత్రం మంచి గుర్తింపును అయితే తీసుకువచ్చింది. అదే విధంగా అల్లు అర్జున్ కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాలో చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాతో అల్లు అర్జున్ చాలా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. తొలిప్రేమ సినిమా చూసిన ప్రతిసారి ఆ దర్శకుడితో ఒక సినిమా చేయాలని అల్లు అర్జున్ అనుకునేవాడంట…

    ఇక కరుణాకరన్ తో హ్యాపీ సినిమా చేసే అవకాశం అయితే వచ్చింది. మొత్తానికైతే వీళ్ళ కాంబోలో వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ కి సక్సెస్ ల పరంగా ఎలాంటి గుర్తింపు తీసుకు రాకపోయినప్పటికీ నటుడిగా మాత్రం అతన్ని ఒక మెట్టు పైకి ఎక్కించిందనే చెప్పాలి. ఇక నితిన్ చేయాల్సిన సినిమాను అల్లు అర్జున్ చేసి మంచి గుర్తింపు పొందడమే కాకుండా లవర్ బాయ్ ఇమేజ్ ను కూడా పొందాడు.

    ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకుంటుంటే నితిన్ మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్ లో చేస్తున్న ‘రాబిన్ హుడ్’ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమాతో పాటుగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…