https://oktelugu.com/

Income plan: జీతం సరిపోవడం లేదా? ఈ విధంగా చేస్తే రూ.5.56 కోట్లు వస్తాయి..

అవసరాలు తీర్చుకోకుండా డబ్బు సేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి సమయంలో ఓ వైపు సేవ్ చేస్తూ..మరోవైపు ఖర్చులకు ఉపయోగపడే విధంగా ఓ ప్రణాళిక వేసుకోవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 17, 2024 / 01:25 PM IST
    Follow us on

    Income plan: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాధనే లక్ష్యంగా నిర్ణయించుకుంటున్నారు. అయితే ఒకరికి మించి మరొకరికి ఆదాయం ఎక్కువైతే వస్తుంది గానీ.. దానిని ఎలా సేవ్ చేసుకోవాలో చాలా మందికి తెలియడం లేదు. చాలా మందికి వ్యాపారం, ఉద్యోగం ద్వారా ఆదాయం పెరుగుతున్నా.. సేవింగ్స్ మాత్రం ఏముండదు. పెరిగిన ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగని అవసరాలు తీర్చుకోకుండా డబ్బు సేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి సమయంలో ఓ వైపు సేవ్ చేస్తూ..మరోవైపు ఖర్చులకు ఉపయోగపడే విధంగా ఓ ప్రణాళిక వేసుకోవచ్చు. దీంతో జీవితాంతం అన్నీ ఖర్చులు పోనూ.. రిటైర్డ్ అయ్యే సమయానికి రూ.5.56 కోట్లు మిగులుతాయి. అదెలాగంటే?

    వ్యాపారస్తులకు లాభం పెరగాలని, ఉద్యోగులకు జీతం పెరగాలని ఆశ ఉంటుంది. అయితే చాలా మంది ఆదాయం పెరిగిన తరువాత వాటిని అదనపు ఖర్చులకు వినియోగిస్తారు. అప్పటి వరకు లేని అలవాట్లను చేసుకుంటారు. ఇలా ఆదాయం పెరిగిన ప్రతీసారి ఖర్చు పెట్టుకుంటుపోతే సేవింగ్స్ ఏమాత్రం కనిపించదు. మరికొందరు తమకు జీతం తక్కువ అని భాధపడుతూ ఉంటారు. కానీ ఖర్చుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గరు. ఉన్నదాంట్లోనే ప్రణాళిక వేసుకోవడం వల్ల ఆదాయం పెరగడంతో పాటు అవసరాలు తీరుతాయి.

    ప్రతీ వ్యక్తి తాను జీవించడంతో పాటు కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఈ క్రమంలో తనకు యవ్వనం వయసు పూర్తి కాగానే ఏదో ఒక ఉద్యోగం చేస్తాడు. కనీసం 30 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేయడం ప్రారంభిస్తే అప్పడే సేవింగ్స్ చేయడం నేర్చుకోవాలి. అలా ప్రతీనెలా దాచుకుంటూ వస్తే తెలియకుండానే డబ్బు అనుకోని విధంగా పెరుగుతుంది. అంతేకాకుండా వచ్చిన జీతంలో కాస్త ప్రణళిక ద్వారా ఖర్చులకు వెచ్చిస్తే ఎలాంటి సమస్య ఉండదు.

    ఓ ప్లాన్ ప్రకారం వెళ్తే రిటైర్డ్ అయ్యే సరికి రూ.5.56 కోట్లు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తికి 30 సంవత్సరాల వయసులో తనకు వచ్చిన జీతంలో రూ.5000 సేవింగ్స్ చేస్తున్నారనుకోండి. అయితే తనకు ప్రతీ సంవత్సరం ఎంతో కొంత జీతం పెరుగుతుంది. ఎంత పెరిగినా రెండో సంవత్సరం నుంచి రూ.5,100, మూడో సంవత్సరం నుంచి రూ.5,200 ఇలా ఉద్యోగంలో ఉన్నంత కాలంలో కొంత పర్సంటేజీ ప్రకారం సేవ్ చేసుకోవడం వల్ల మధ్యలో పిల్లల చదువుల ఖర్చులతో పాటు రిటైర్డ్ అయ్యే సరికి రూ.5.56 కోట్లు సేవ్ అవుతాయి.