Small cars : ప్రస్తుత కాలంలో చాలా మంది సొంత కారును కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు కారు కొనాలంటే అనువైన బడ్జెట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు లో బడ్జెట్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాకుండా కారు కొనుగోలు చేసేందుకు వివిధ బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నాయి. అందువల్ల మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం కొత్త కార్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే వినియోగదారుల అభిరుచులు, అవసరాలను బట్టి కొత్త కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు వివిధ వేరియంట్లను పలు కంపెనీలు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే తాజాగా ఓ చర్చ ప్రకారం భవిష్యత్ లో చిన్న కార్లదేహవా ఉంటుందని అంటున్నారు. ఎస్ యూవీలు, 7 సీటర్ కాదని ఎలక్ట్రిక్ కార్లకే ప్రిఫరెన్స్ ఇవ్వనున్నారు. ఎందుకంటే?
దేశంలోని కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న సంస్థ మారుతి. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన పలు మోడళ్లు సక్సెస్ ఫుల్ గా మార్కెట్లో తిరుగుతున్నాయి. సామాన్యుడు సైతం కొనేలా ఈ కంపెనీ లో బడ్జెట్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవల నిర్వహించిన వార్షిక సమావేశంలో మారుతి సుజుకీ కంపెనీ ఇండియా చైర్మన్ ఆర్ సి భార్గవ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లో చిన్న కార్లకే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.
మారుతి నుంచి రిలీజ్ అయిన వ్యాగన్ ఆర్, స్విప్ట్ మోడళ్లు మిగతా కార్ల కంటే ఎక్కువ సేల్స్ ను నమోదు చేసుకున్నాయి. ఇవి దశాబ్దాలుగా వినియోగదారుల మనసును దోచుకుంటున్నాయి. అందుకే వీటి ఆదరణ తగ్గలేదు. అయితే మారుతి వ్యాగన్ ఆర్, స్విప్ట్ మార్కెట్లోకి వచ్చిన తరువాత ఎన్నో ఎస్ యూవీలు, 7 సీటర్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ మారుతి వ్యాగన్ ఆర్, స్విప్ట్ ను బీట్ చేయలేకపోయాయి. మారుతి స్విప్ట్ ఈ మే నెలలో అప్ గ్రేడ్ కారు అందుబాటులోకి వచ్చింది.
మారుతి కంపెనీ ఇండియా చైర్మన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది టూ వీలర్ ను కలిగి ఉన్నారు. అయితే వీటి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి బైక్ వరకు రూ. లక్షకు పైగానే ఉంది. అయితే కొందరు ఈ ధరతో టూవీలర్ కొనే బదులు మరింత బడ్జెట్ ను కలిపి ఫోర్ వీలర్ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ కార్ల ధరలు తక్కువవుతున్నాయి. ప్రస్తుతం మారుతి కంపెనీ నుంచి ఆల్టో కే 10 నుంచి రూ. 4 లక్షల లోపు కొనుగోలు చేయొచ్చు. భవిష్యత్ లో ఈ కంపనీ నుంచి మరింత లో బడ్జెట్ కార్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
త్వరలో మారుతి నుంచి 5 ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇవి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఈవీలకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మార్కెట్లోకి ఎలాంటి కారు వచ్చినా దాని కంటే మారుతి కారు లో బడ్జెట్ నే కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో మార్కెట్లోకి వచ్చే మారుతి ఈవీలు కూడా అందుబాటు ధరలోనే ఉండనున్నాయని తెలుస్తోంది. అదే జరిగితే చిన్ కార్లదే హవా సాగే అవకాశం ఉంది.