Saripodhaa Sanivaaram: నేచరల్ స్టార్ నాని హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ రేపు ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక మంచి ఇంటెన్స్ డ్రామాని చూడబోతున్నాం అనే అనుభూతిని కలిగించింది. ముఖ్యంగా నాని, ఎస్ జె సూర్య మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు అదిరిపోయాయని మనకి ట్రైలర్ ని చూస్తేనే అర్థం అవుతుంది. ట్రైలర్ తెచ్చిన క్రేజ్ కారణంగా ఈ సినిమాకి అనకాపల్లి నుండి అమెరికా వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. బుకింగ్స్ ద్వారా వచ్చిన ఆ గ్రాస్ ని చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల నుండి 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోని కాసేపటి క్రితమే దుబాయిలో పలువురు ప్రముఖులకు వేసి చూపించారు.
వారి నుండి వచ్చిన టాక్ ఇప్పడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అక్కడి నుండి వచ్చిన టాక్ ఏమిటంటే ఈ చిత్రంలో ట్విస్టులు ఆశించి ప్రేక్షకుడు థియేటర్ లోకి అడుగుపెడితే నిరాశ చెందుతారని అంటున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఒక సామాన్యుడికి, పోలీస్ ఆఫీసర్ కి మధ్య జరిగే పోరు. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయట. ముఖ్యంగా విలన్ గా నటించిన ఎస్ జె సూర్య నటనని థియేటర్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్ గుర్తు చేసుకుంటారట. ఇక ఇంటర్వెల్ సన్నివేశం అదిరిపోయిందని అంటున్నారు. రీ రికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పలు సన్నివేశాలను బాగా హైలైట్ చేశాయట. స్టోరీ సాధారణమైనదే అయినా స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తన విశ్వరూపం చూపించాడని తెలుస్తుంది. నాని కి రెండు మూడు ఎలివేషన్ సన్నివేశాలు తన కెరీర్ లోనే బెస్ట్ గా ఉంటాయట. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది.
ఇందులో హీరోయిన్ ప్రియాంక మోహన్ కానిస్టేబుల్ గా నటించింది. ఓవరాల్ గా ఈ చిత్రం మాస్ ఆడియన్స్ తెగ నచ్చేస్తుంది, నాని ఇమేజి ని మరో మెట్టు ఎక్కేలా చేస్తుందని, అనుకున్న విధంగా ఈ సినిమాకి ఇండియా లో కూడా టాక్ వస్తే 60 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. మరి దుబాయి నుండి వచ్చిన ఈ టాక్ నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. ఇది ఇలా ఉండగా నాని ‘దసరా’ చిత్రం వసీస్ మరియు నైజాం ప్రాంతాలలో దుమ్ము లేపేసింది. కానీ ఆంధ్ర లో మాత్రం అంతంత మాత్రంగానే ఆడింది. ‘సరిపోదా శనివారం’ చిత్రం మాత్రం అన్ని ప్రాంతాలలో బంపర్ హిట్ అయ్యే విధంగా కంటెంట్ ఉంటుందని టాక్.