https://oktelugu.com/

Maruti Brezza : ఈ మారుతి కారుపై రూ.42 వేల డిస్కౌంట్.. వెంటనే త్వరపడండి

దేశంలో కార్ల మార్కెట్లో ఉన్న అగ్ర కంపెనీల్లో మారుతి ఒకటి. ఈ కంపెనీ నుంచి హ్యాచ్ మొదలు ఎలక్ట్రిక్ కారు వరు అన్ని వేరియంట్లు రిలీజ్ అవుతున్నాయి. లేటేస్టుగా ఓ ఎస్ యూవీ కారుపై డిస్కౌంట్ పక్రటించారు. అదే బ్రెజ్జా. భారతీయులు ఎక్కువగా ఎస్ యూవీ సెగ్మెంట్ ను కోరుకుంటున్నారు. ఈ తరుణంలో డిస్కౌంట్ తో వచ్చే ఈ కారు ప్రయోజనం కలిగించనుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 12, 2024 / 01:15 PM IST

    Maruthi Brezza

    Follow us on

    Maruti Brezza : కార్ల వినియోగం భారత్ లో రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో చాలా కంపెనీలు కొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు సేల్స్ ను పెంచుకునేందుకు పాత వెహికల్స్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. సాధారణంగా కార్లపై కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే ఆఫర్లు ప్రకటిస్తారు. కానీ ప్రస్తుతం పండుగల సీజన్ ప్రారంభమైనా.. ప్రత్యేకమైన సందర్భాలేమీ లేకున్నా.. మారుతి కంపెనీ ఓ కారుపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. మారుతికి చెందిన ఓ ఎస్ యూవీ కారుపై ఆపర్ ప్రకటించారు. ఈ కారు ఎస్ యూవీగా ఇప్పటికే వినియోగదారులను ఆకట్టుకున్నప్పటికీ మరింత సేల్స్ పెంచేందుకు తగ్గింపు ధరతో ఇస్తున్నారు. మరి మారుతికి చెందిన ఏ కారుపై డిస్కౌంట్ ప్రకటించారు? ఎంత వరకు ఆఫర్ వర్తిస్తుంది?

    దేశంలో కార్ల మార్కెట్లో ఉన్న అగ్ర కంపెనీల్లో మారుతి ఒకటి. ఈ కంపెనీ నుంచి హ్యాచ్ మొదలు ఎలక్ట్రిక్ కారు వరు అన్ని వేరియంట్లు రిలీజ్ అవుతున్నాయి. లేటేస్టుగా ఓ ఎస్ యూవీ కారుపై డిస్కౌంట్ పక్రటించారు. అదే బ్రెజ్జా. భారతీయులు ఎక్కువగా ఎస్ యూవీ సెగ్మెంట్ ను కోరుకుంటున్నారు. ఈ తరుణంలో డిస్కౌంట్ తో వచ్చే ఈ కారు ప్రయోజనం కలిగించనుంది. మారుతి బ్రెజ్జా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేయనుంది. ఇందులో 101 బీహెచ్ పీ పవర్, 136 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. పెట్రోల్ వేరియంట్ మాత్రమే కాకుండా బ్రెజ్జా సీఎన్ జీ ఆప్షన్ లో అందుబాటులో ఉంది.

    బ్రెజ్జా ఫీచర్లు ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఇందులో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. 4 స్పీకర్ సౌండ్ బాక్స్ ను అమర్చారు. వైర్ లెస్ ఫోన్ చార్జర్, యాంబియంట్ లైట్ ఉన్నాయి. వీటితో పాటు సన్ రూఫ్ ఆకర్షించనుంది. ఇక బ్రెజ్జా సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, బ్యాక్ సైడ్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.ఎస్ యూవీ విభాగంలో ఇప్పటికే మార్కెట్లో ఉన్న మహీంద్రా ఎక్స్ యూవీ 300 ఎక్స్ 0కి బ్రెజ్జా గట్టి పోటీ ఇస్తోంది.

    ప్రస్తుతం మార్కెట్లో బ్రెజ్జాను రూ.8.34 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ ను రూ.14.14 లక్షలుగా ఉంది. అయితే ఆ ఆగస్టులో బ్రెజ్జాకారుపై ఆఫర్ ను ప్రకటించారు. ఈ కారుపై ప్రస్తుతం కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్చేంజ్, క్యాష్ బ్యాక్ లన్నీ కలపి రూ.42 వేల తగ్గింపును పొందవచ్చని కంపెనీ తెలిపింది. అయితే ఆయా ప్రాంతాల్లోని ట్యాక్స్ ల ఆధారంగా డిస్కౌంట్లు రేట్లలో మార్పు ఉండే అవకాశం ఉంది. కానీ మొత్తంగ ఈ కారుపై ప్రస్తుతం తగ్గింపు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఎస్ యూవీ వేరియంట్ లో కొత్త కారు కొనాలనుకునేవారికి బ్రెజ్జా బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.