Bank Clients: భారతదేశపు అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులను అలర్ట్ చేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలను జనవరి 22న నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది.
ఆన్ లైన్ సేవలు శనివారం కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయి. రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు సేవల్లో అంతరాయం ఉంటుందని ఎస్ బీఐ పేర్కొంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యూపీఐ సేవలు పని చేయవని అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
Also Read:పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందాం.. మంత్రి కొడాలి నానికి బొండా ఉమ సవాల్..
ఎస్ బీఐ కి దేశ వ్యాప్తంగా 22 వేల శాఖలు, 57 వేల 889 ఏటీఎం కేంద్రాలు దీనికి ఉన్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎస్ బీ ఐ తకాలంగా టెక్నాలజీ అప్ గ్రేడేషన్ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం డిసెంబర్ నెలలో కూడా అప్ గ్రేడేషన్ ప్రక్రియను చేపట్టగా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సారి ఆ సమస్యను పూర్తిగా తొలగించాలని భావిస్తున్నది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ బ్యాంకుకైనా టెక్నాలజీ పరంగా అప్ గ్రేడేషన్ తప్పనిసరి. ఈ విషయంలో ప్రవేట్ బ్యాంకులు ఎక్కువగా దృష్టి సారిస్తుంటాయి. ఖాతాదారులకు ముందుగా సమాచారం ఇవ్వడంతో సమస్య తప్పింది. ఆ సమయంలో ఎలాంటి లావాదేవీలు చేయకుంటే సరిపోతుంది. చేసినా.. డబ్బులు ఎటు వెళ్లవు. మూడు రోజుల పనిదినాల్లో నగదు తిరిగి జమ అవుతుంది. కానీ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఇబ్బంది తప్పదు.