Pearl Millet: సజ్జలు తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. చలికాలంలో సజ్జలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సజ్జల్లో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో సజ్జలు తినడం ద్వారా సులభంగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సజ్జలు అద్భుతమైన శక్తివనరుగా పనిచేస్తాయి.

ఇమ్యూనిటీ సిస్టమ్ ను బలోపేతం చేయడంలో సజ్జలు ఎంతగానో తోడ్పడతాయని చెప్పవచ్చు. ప్రతిరోజూ సజ్జలతో చేసిన వంటకాలు తినడం ద్వారా సులభంగా కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చు. సజ్జల్లో ఉండే ఫైబర్ గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా రక్షించడంలో ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ సజ్జలు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ అదుపులో ఉండే ఛాన్స్ ఉంటుంది.
Also Read: మీ మెదడు పనితీరు అద్భుతంగా పని చేయాలా ?.. ఐతే.. !
ఎవరైతే ఐరన్ లోపంతో బాధ పడుతూ ఉంటారో వాళ్లను అనేక ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది. సజ్జల ద్వారా శరీరానికి అవసరమైన ఐరన్ లభిస్తుంది కాబట్టి తీసుకునే ఆహారంలో సజ్జలను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. చర్మంలో శరీరానికి అవసరమైన ఫినాలిక్ లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. సజ్జలు ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా ముఖంపై వచ్చే ముడతలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.
సజ్జలు జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఎంతగానో తోడ్పడతాయి. ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సజ్జలు ఎంతగానో తోడ్పడతాయని చెప్పవచ్చు. ప్రతిరోజూ సజ్జలతో చేసిన వంటకాలను తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు.
Also Read: కిడ్నీలో రాళ్లను సహజంగా కరిగించే గొప్ప మార్గాలు !
[…] Bimbisara: మల్లిడి వేణు అలియాస్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ‘బింబిసార’ అంటూ హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా ఓ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటిస్తూ.. పైగా ఆ చిత్రాన్ని తానే నిర్మిస్తున్నాడు. కాగా బింబిసార చిత్రం విడుదల తేదీ దాదాపుగా ఖరారయ్యింది. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో కల్యాణ్ బింబిసార అనే క్రూరమైన రాజుగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా దీన్ని తీసుకొస్తున్నారు. […]
[…] Samantha: సమంత తన నాలుగేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి.. ప్రస్తుతానికి సోలో లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సమంత తన స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతోంది. తాజాగా ఈ వెకేషన్ ట్రిప్ ఫోటో ఒకటి ఆమె షేర్ చేసింది. ‘నాలుగో రోజు.. మ్యాజిక్. స్కీయింగ్ అంత ఈజీ కాదు కానీ చాలా సరదానిస్తుంది’ అని ఓ ఫొటో పెట్టి ట్యాగ్ చేసింది. […]