EMI : కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ రూల్ పాటిస్తే.. EMI భారం తగ్గుతుంది..

కారు కావాలని కోరిక ఉన్నా.. దీనిని కొనాలంటే లక్షలు వెచ్చించాల్సిందే. డబ్బున్న వారికి కారు కొనడం పెద్ద విషయం కాదు. కానీ మిడిల్ క్లాస్ వారు కారు కొనాలని కోరిక ఉంటే.. ఫైనాన్స్ ద్వారానే సాధ్యం అవుతుంది. అయితే కొందరు నెలనెల ఈఎంఐ కట్టడానికి దాదాపు 100 శాతం వరకు రుణ సాయం తీసుకుంటారు. ఇలా కారు కొనడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతారు. అంతేకాకుండా వడ్డీ భారం ఎక్కువై ఈఎంఐ కట్టలేరు. అయితే ఈఎంఐ భారం పడకుండా ఉండడానికి ఈ సూత్రం పాటించాలి.

Written By: Srinivas, Updated On : October 23, 2024 11:01 am

EMI

Follow us on

EMI :  సొంత కారు ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. కార్యాలయ అవసరాలతో పాటు విహార యాత్రలకు వెళ్లాలని అనుకునేవారు.. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయాలని అనుకునేవారికి ఈరోజుల్లో కారు తప్పనిసరిగా మారింది. అయితే ఏ కారు కొనాలి? అనే విషయంలో కొందరికి సందేహం ఉంటుంది. అంతేకాకుండా కారు కోసం ఎంత మనీ వెచ్చించాలి? ఎంత ఈఎంఐ పే చేయాలి? అనే విషయాలపై అవగాహన ఉండదు. ఇలాంటి వారు కారు కొని తిప్పలు పడుతూ ఉంటారు. ఈ తరుణంలో కారు కొనే ముందు ఓ సూత్రం పాటించాలి. ఈ సూత్రం ప్రకారం కారు కొనుగోలు చేయడం వల్ల ఈఎంఐ భారం పడకుండా ఉంటుంది. మరి ఆ సూత్రం ఏదంటే?

కారు కావాలని కోరిక ఉన్నా.. దీనిని కొనాలంటే లక్షలు వెచ్చించాల్సిందే. డబ్బున్న వారికి కారు కొనడం పెద్ద విషయం కాదు. కానీ మిడిల్ క్లాస్ వారు కారు కొనాలని కోరిక ఉంటే.. ఫైనాన్స్ ద్వారానే సాధ్యం అవుతుంది. అయితే కొందరు నెలనెల ఈఎంఐ కట్టడానికి దాదాపు 100 శాతం వరకు రుణ సాయం తీసుకుంటారు. ఇలా కారు కొనడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతారు. అంతేకాకుండా వడ్డీ భారం ఎక్కువై ఈఎంఐ కట్టలేరు. అయితే ఈఎంఐ భారం పడకుండా ఉండడానికి ఈ సూత్రం పాటించాలి.

కారు కొనాలని అనుకునే వారు ముందుగా డౌన్ పేమెంట్ కట్డే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని కంపనీలు డౌన్ పేమెంట్ లేకుండానే కారు రుణ సాయం అందిస్తారు. అయితే కచ్చితంగా కారు ఖరీదులో 20 శాతం వరకు డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఉదాహరణకారు కారు ధర రూ.10 లక్షలు ఉంటే రూ. 2 లక్షల వరకు డౌన్ పేమెంట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఈఎంఐ భారం ఉండదు. పైగా కొంత వరకు కారు ధర చెల్లించిన వారవుతారు.

సాధారణంగా ఎక్కువ శాతం మంది ఉద్యోగులే ఈఎంఐతో కారు కొనాలని చూస్తారు. అయితే తమకు వచ్చే జీతంలో 10 శాతం వరకు మాత్రమే కారు కోసం ఖర్చు చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరనకు లక్ష రూపాయల జీతం ఉంటే 10 శాతం అంటే 10 వేలు మాత్రమే కారు కోసం కేటాయించాలి. ఇందులోనే కారు మెయింటనెన్స్ ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే మిగతా ఖర్చులపై ఈ ప్రభావం పడదు. ఇక చివరగా కారు టెన్యూర్ ను 4 సంవత్సరాకు మించి ఉండకూడదు. ఆపైగా ఉండడం వల్ల ఈఎంఐ భారంతో కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది.

ఈ సూత్రం ప్రకారం మాత్రమే కారు కొనేందుకు ప్లాన్ చేయాలి. కారు కొనడం వల్ల మిగతా ఖర్చలుపై ప్రభావం పడడం ల్ల కారు భారంగా మారుతుంది. దీంతో భవిష్యత్ లోకారు కొన్న ప్రయోజనం ఉండదు. అలాగే ఎక్కువ కాలం ఈఎంఐ ఏర్పాటు చేసుకోవడం వల్ల మిగతా ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. అందువల్ల కారు రెగ్యులర్ లైఫ్ కు ఎంత అవసరమో.. అంత భారం కాకుండా చూసుకోవాలి.