https://oktelugu.com/

Electric scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ పై దీపావళి బంపర్ ఆఫర్.. రూ.30 వేల తగ్గింపు.. అక్టోబర్ 31 లోపే..

దేశంలో టూవీలర్ కొనేవారు ఎక్కువగా ఈవీల వైపే చూస్తున్నారు. పెట్రోల్ ధరలు తగ్గకపోవడంతో పాటు తక్కువ ఖర్చులో ప్రయాణించాలని అనుకునేవారికి ఈవీ బెస్ట్ అప్షన్ అని అనుకుంటున్నారు. వినియోగదారుల డిమండ్ ను బట్టి చాలా కంపెనీలు కొత్తకొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇటీవల ఈవీ స్కూటర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 23, 2024 / 10:56 AM IST

    Electric scooter

    Follow us on

    Electric scooter : ప్రస్తుతం ఆటోమోబైల్ రంగం ఎలక్ట్రిక్ మయం అయిపోతుంది. 4 వీలర్ నుంచి టూ వీలర్ వరకు అన్నీ ఈవీలుగా వస్తున్నాయి. ఇప్పటికే చాలా వారకు ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కంపెనీల మధ్య పోటీ ఏర్పడడంతో కొన్ని వాహానాలపై ఆఫర్లు ప్రకటించారు. అందులోనూ దీపావళి పండుగ సందర్భంగా తగ్గింపు ధరను ప్రకటించారు. అయితే ఈఆఫర్ అక్టోబర్ 31 వరకే అని ప్రకటించారు. దీపావళి సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలని అనుకునేవారు ఇది మంచి అవకాశం అని కంపెనీన ప్రతినిధులు చెబుతున్నారు. ఇంతకీ ఆ స్కూటర్ ఏదంటే?

    దేశంలో టూవీలర్ కొనేవారు ఎక్కువగా ఈవీల వైపే చూస్తున్నారు. పెట్రోల్ ధరలు తగ్గకపోవడంతో పాటు తక్కువ ఖర్చులో ప్రయాణించాలని అనుకునేవారికి ఈవీ బెస్ట్ అప్షన్ అని అనుకుంటున్నారు. వినియోగదారుల డిమండ్ ను బట్టి చాలా కంపెనీలు కొత్తకొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇటీవల ఈవీ స్కూటర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పాత పెట్రోల్ బైక్ ల స్థానంలో ఈవీ స్కూటర్ ను కొనుగోలు చేస్తున్నారు. ఇవి ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100కు పైగా కిలోమీరట్ల మైలేజ్ కూడా ఇస్తుండడంతో ఈవీలపై మనసుపెడుతున్నారు.

    మరోవైపు దేశంలో దీపావళి అందరికీ పెద్ద పండుగ. ఈ సందర్భంగా కొందరు కొత్త వెహికల్ కొనాలని అనుకుంటారు. కంపెనీలు సైతం తమ సేల్స్ పెంచుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తాజాగా దీపావళి సందర్భంగా ‘క్వాంటమ్ ఎనర్జీ’ కంపెనీ ఈవీ స్కూటర్ పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ కంపెనీకి చెందిన మూడు స్కూటర్లలో ఏది కొనుగోలు చేసినా రూ.30 వేల వరకు తగ్గింపుతో విక్రయించనుంది.ఈ కంపెనీకి చెందిన ఏ స్కూటర్లపై ఆఫర్లు ప్రకటించిందంటే?

    క్వాంటమ్ ఎనర్జీ కంపెనీకి చెందిన మూడు స్కూటర్లపై దీపావళి ఆఫర్లు ప్రకటించింది. వీటిలో ప్లాస్మా ఎక్స్, ప్లాస్మా ఎక్స్ ఆర్, మిలన్ ఉన్నాయి. మూడు స్కూటర్లపై రూ. 30 వేల తగ్గింపును ప్రకటించారు. ప్లాస్మా ఎక్స్ ప్రస్తుతం మార్కెట్లో రూ.1,29,150తో విక్రయిస్తున్నారు. ఆఫర్ కింద దీనిని రూ.99,999కే సొంతం చేసుకోవచ్చు. ప్లాస్మా ఎక్స్ ఆర్ ధర రూ.1.09,999 గా ఉంది. ఆఫర్ కింది ఇది రూ.89,095కే వస్తుంది. మూడో స్కూటర్ మిలన్ ప్రస్తుతం రూ.85,999కి విక్రయిస్తున్నారు. దీనికి ఆఫర్ వర్తిస్తే రూ.79,999కి ఇంటికి తీసుకెళ్తొచ్చు. వీటిలో ప్లాస్మా ఎక్స్ స్కూటర్ 1500 వాట్ మోటర్ ను కలిగి ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే ప్లాస్మా ఎక్స్ ఆర్ లో 1500 వాట్ తో 100 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మిలన్ స్కూటర్ 100 వాట్ లను కలిగి 100 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

    దీపావళి సందర్భంగా ఈ ఆఫర్ ను ప్రకటించారు. దీంతో అక్టోబర్ 18 నుంచి 31 వరకు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకునేవారికి ఈ ఆఫర్ తో కొనడం వల్ల చాలా వరకు సేఫ్ అవుతోంది. మార్కెట్లోకి ఎన్నో ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నాయి. ఇవి దాదాపు రూ. లక్షకు పైగానే ఉంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఈస్కూటర్లను రూ. లక్ష లోపే సొంతం చేసుకోవచ్చు.