Prabhas Fauji movie : ప్రభాస్ ఫౌజీ లో విలన్ ఎవరో తెలిసిపోయింది…మరోసారి బాలీవుడ్ స్టార్ హీరోను రంగం లోకి దింపుతున్న డైరెక్టర్…

ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరకడం మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఆయన లాంటి హీరో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం చాలా అవసరం... హాలీవుడ్ ఇండస్ట్రీలో వెయిట్ చేస్తున్న ఈ హీరో తెలుగు సినిమా స్థాయిని పెంచాడనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : October 23, 2024 11:26 am

Prabhas Fauji movie

Follow us on

Prabhas Fauji Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి నటుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న ఆయన ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలామంది అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి తనదైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ హను రాఘవ పూడి దర్శకత్వంలో చేస్తున్న ‘ఫౌజీ’ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరోని తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికైతే హను రాఘవపూడి ఇంతకుముందు చేసిన ‘సీతా రామం’ సినిమా భారీ రేంజ్ లో సక్సెస్ అయితే సాధించింది. దానివల్లే ఆయనకు డైరెక్ట్ గా ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం అయితే వచ్చింది. మరి ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనను తాను స్టార్ట్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే పాన్ ఇండియాలో ఆయనకు తిరుగుండదనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఆయన ఇప్పుడు ఈ సినిమా మీద భారీ కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక బాలీవుడ్ హీరోని విలన్ గా తీసుకోవాలనే ఆలోచన బాగానే ఉంది.

కానీ బాలీవుడ్ హీరోలు విలన్ గా చేస్తే ప్రభాస్ కి అంత బాగా కలిసి రావడం లేదనే వార్తలు కూడా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ‘ఆదిపురుషు’ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించి మెప్పించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఇక ఇప్పుడు కూడా అదే తరహాలో బాలీవుడ్ స్టార్ హీరో అయిన సంజయ్ దత్ ను ప్రభాస్ ను ఢీకొట్టే పాత్రలో తీసుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి బాలీవుడ్ హీరో ను విలన్ గా తీసుకొని ఒకసారి దెబ్బ అయిపోయిన ప్రభాస్ ఈసారి కూడా అదే రిపీట్ చేయబోతున్నాడా అనే అనుమానాలను కూడా తన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరోను ఎదుర్కోవాలంటే ఒక భారీ విలన్ అయితే ఉండాలి. అలా ఉన్నప్పుడే సినిమా అనేది భారీగా ఎలివేట్ అవుతుంది.

ముఖ్యంగా సలార్ సినిమాలో ప్రశాంత్ నీల్ ప్రభాస్ చాలా గొప్పగా చూపించాడు. అలా ఫౌజీ సినిమాలో కూడా హను రాఘవ పూడి ప్రభాస్ ని చాలా హై రేంజ్ లో చూపించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే రేంజ్ కి ఎదగడం అనేది నిజంగా మన అదృష్టమనే చెప్పాలి…