ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా.. వెంటనే ఏం చేయాలంటే..?

మన నిత్య జీవితంలో ఆధార్ కార్డుకు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ ఉంటే మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను పొందే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్ ఐడెంటిటీ కార్డ్ గా పని చేయడంతో పాటు ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఆధార్ కార్డును మిస్ చేసుకుంటే మాత్రం ఇబ్బంది పడక తప్పదు. ఆధార్ కార్డును పోగొట్టుకుంటే ఆ కార్డు దుర్వినియోగం కాకుండా […]

Written By: Navya, Updated On : April 23, 2021 3:26 pm
Follow us on

మన నిత్య జీవితంలో ఆధార్ కార్డుకు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ ఉంటే మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను పొందే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్ ఐడెంటిటీ కార్డ్ గా పని చేయడంతో పాటు ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఆధార్ కార్డును మిస్ చేసుకుంటే మాత్రం ఇబ్బంది పడక తప్పదు.

ఆధార్ కార్డును పోగొట్టుకుంటే ఆ కార్డు దుర్వినియోగం కాకుండా ఆ కార్డును లాక్ చేసుకుంటే మంచిది. యూఐడీఏఐ వెబ్‌సైట్‌ ద్వారా ఆధార్ కార్డును సులభంగా లాక్ చేసుకోవచ్చు. లాక్, అన్‌లాక్ బయోమెట్రిక్స్ ఆప్షన్ ను ఎంచుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆ తరువాత క్యాప్చాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.

ఈ విధంగా ఎంటర్ చేయడం వల్ల బయోమెట్రిక్స్ లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంఆధార్ యాప్ సహాయంతో కూడా బయోమెట్రిక్స్ లాక్, అన్ లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈ సేవలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆధార్ కార్డ్ లాక్ చేసుకోవడం వల్ల ఇతరులు ఎట్టి పరిస్థితుల్లో మన బయోమెట్రిక్స్ ను యాక్సెస్ చేసే అవకాశం అయితే ఉండదు.

యూఐడీఏఐ యాప్ సహాయంతో సులభంగా ఈ ఆప్షన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.