https://oktelugu.com/

ఏటీఎంలో చిరిగిన నోట్లు వచ్చాయా.. ఏం చేయాలంటే..?

మనలో చాలామంది బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి ఏటీఎంలకు వెళ్తూ ఉంటారు. గతంతో పోలిస్తే బ్యాంకుకు వెళ్లి నగదును విత్ డ్రా చేసుకునే వారి సంఖ్య భారీగా తగ్గింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఎంతో అవసరమైతే తప్ప బ్యాంకుకు వెళ్లడానికి చాలామంది ఆసక్తి చూపించడం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఏటీఎంల నుంచి చిరిగిన నోట్లు కూడా రావడం జరుగుతుంది. చిరిగిపోయిన నోట్లను ఎవరూ తీసుకోరు కాబట్టి చాలామంది అలాంటి నోట్లు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 13, 2021 / 06:56 PM IST
    Follow us on

    మనలో చాలామంది బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి ఏటీఎంలకు వెళ్తూ ఉంటారు. గతంతో పోలిస్తే బ్యాంకుకు వెళ్లి నగదును విత్ డ్రా చేసుకునే వారి సంఖ్య భారీగా తగ్గింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఎంతో అవసరమైతే తప్ప బ్యాంకుకు వెళ్లడానికి చాలామంది ఆసక్తి చూపించడం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఏటీఎంల నుంచి చిరిగిన నోట్లు కూడా రావడం జరుగుతుంది.

    చిరిగిపోయిన నోట్లను ఎవరూ తీసుకోరు కాబట్టి చాలామంది అలాంటి నోట్లు వస్తే తెగ టెన్షన్ పడుతుంటారు. ఏటీఎంల నుంచి వచ్చిన డబ్బులును ఏం చేయాలో తెలియక కంగారు పడుతుంటారు. అయితే ఏటీఎంల నుంచి చిరిగినా లేదా మురికిగా మారి చెల్లని పరిస్థితి ఉంటే బ్యాంకులకు వెళ్లి ఆ నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. 2017 ఏప్రిల్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి బ్యాంకు శాఖలు ఇలాంటి నోట్లను తిరస్కరించకుండా మార్పిడి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

    నోట్లు మార్పిడి చేయడానికి ఏ బ్యాంకు అయినా ఎక్కువ సమయం తీసుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది. నిబంధనలు పాటించని బ్యాంకులు రూ .10,000 వరకు జరిమానా సైతం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సమాచారం. ఏటీఎంల నుంచి చిరిగిపోయిన , పాడైపోయిన నోట్లు వచ్చినట్లయితే వెంటనే ఏటీఎం బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలి.

    విత్ డ్రా స్లిప్ ను కలిగి ఉంటే బ్యాంకుకు ఆ స్లిప్ ను లేదా లావాదేవీ యొక్క ఎస్‌ఎంఎస్‌ ను చూపించాలి. ఆ తరువాత చిరిగిన లేదా చెల్లని నోటు స్థానంలో కొత్త కరెన్సీ నోటును పొందే అవకాశం ఉంటుంది.