https://oktelugu.com/

ఆస్తి పన్ను పెంపుపై బీజేపీ-జనసేన పోరాటం

ఏపీ బీజేపీ పోరాటం మొదలుపెట్టింది. మిత్రపక్షం జసేనతో కలిసి కార్యచరణ కు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ సంక్షేమ పందేరంపై మండిపడింది. రాష్ట్రం ఇంత దారుణ ఆర్థిక పరిస్థితులకు జగన్ పాలనే కారణమని మండిపడింది. వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో డబ్బులు పంచడమే లక్ష్యంగా పనిచేసి రాష్ట్రాన్ని దివాళా తీసిందని ఏపీ బీజేపీ మండిపడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : June 13, 2021 / 07:00 PM IST
    Follow us on

    ఏపీ బీజేపీ పోరాటం మొదలుపెట్టింది. మిత్రపక్షం జసేనతో కలిసి కార్యచరణ కు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ సంక్షేమ పందేరంపై మండిపడింది. రాష్ట్రం ఇంత దారుణ ఆర్థిక పరిస్థితులకు జగన్ పాలనే కారణమని మండిపడింది.

    వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో డబ్బులు పంచడమే లక్ష్యంగా పనిచేసి రాష్ట్రాన్ని దివాళా తీసిందని ఏపీ బీజేపీ మండిపడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి పివిఎన్ మాధవ్ మీడియాకు సమావేశంలో చర్చించిన అంశాలను వివరించారు.

    ప్రభుత్వం అడ్డదారిలో ఆస్తిపన్నులు పెంచడం సిగ్గుచేటని సమావేశంలో నేతలు విమర్శించారని తెలిపారు. ఈ ప్రమాద సమయంలో ప్రజలపై వడ్డన వేయడం అన్యాయమని సభ్యులు పేర్కొన్నారు. ప్రజలపై పెను భారానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా భాజపా, జనసేన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం పెంచిన ఆస్తిపన్నును విరమించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.

    నగరాల నడిబొడ్డులో ఉండే ఆస్తులను వాల్యూయేషన్ చేయించి డబ్బులు అప్పులు తెచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని…వాటిని అడ్డుకుంటామని ఏపీబీజేపీ తీర్మానించింది. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. 21 రోజుల్లో పంటను కొనుగోలు చేయడంతో పాటు రైతాంగ సమస్యలపై పోరాటాలు చేయాలని సమావేశం భావించింది.

    రాష్ట్ర రాజకీయ పరిస్థితి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చించామన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్ణయించినట్లు చెప్పారు. జూన్ 21 యోగా దినోత్సవంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. జూన్ 28 న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వర్చువల్ లో నిర్వహించాలని నిర్వహించినట్లు చెప్పారు. వ్యవసాయంపై ప్రత్యేకంగా చర్చించామని, రైతాంగ సమస్యలపై రైతులకు అండగా ఉద్యమించాలని తీర్మినించినట్లు చెప్పారు.

    పార్టీని సంస్థాగతంగా బలోపేతంపై చర్చించారు. విశాఖ భూ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బిల్ట్ ఎపి పేరుతో ఆస్తులను తనఖా పెట్టడాన్ని సమావేశం వ్యతిరేకించింది. పెట్రోల్, గ్యాస్ ధరలు గ్లోబల్ మార్పుల వలనే పెరుగుతున్నాయని, పెట్రోల్, డీజిల్ జిఎస్టికి తీసుకొస్తే ధరలు తగ్గుతాయన్నారు. భాజపా టిడిపి తో ఎట్టి పరిస్థితుల్లో కలవదని, చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా పొత్తు ప్రసక్తే లేదని అన్నారు.

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి, భాజపా ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి పి. మురళీధరన్ జాతీయ సంఘటనా సంయుక్త కార్యదర్శి శివప్రకాశ్, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, సహా ఇంచార్జి స్సునిల్ దేవధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్సులు పివిఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణ రాజు, లోకుల గాంధీ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో జరిగిన విశేషాలను ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పివిఎన్ మాధవ్ మీడియాకు వివరించారు.