https://oktelugu.com/

Bank Loan: ఇలా చేస్తే తక్కువ వడ్డీతో బ్యాంకు రుణం తీరుస్తారు.. వెంటనే తెలుసుకోండి..

సాధారణంగా ఇల్లు నిర్మించుకోవడానికి కొందరు జీవిత లక్ష్యాంగా నిర్ణయించుకుంటారు. అయితే అనువైన సమయంలో అనుకున్న ఆదాయం లేకపోవడంతో బ్యాంకు రుణం తీసుకుంటారు. బ్యాంకు రుణం తీసుకోవడం వల్ల ఓ వైపు లోన్ తీరుస్తూనే మరోవైపు ఇల్లు నిర్మించుకోవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 6, 2024 1:12 pm
    Bank Loan

    Bank Loan

    Follow us on

    Bank Loan: జీవితంలో ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం కచ్చితంగా ఉంటుంది. నేటికాలంలో డబ్బు లేకుండా జీవితం నడవదనే చెప్పొచ్చు. అందువల్ల ఏదో ఒక పని చేసి డబ్బును కూడబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అయితే అందరికీ అనుకూలంగా నగదు ఉండకపోవచ్చు. కొందరికి తక్కువ, మరికొందరకి ఎక్కువగా ఉంటుంది. కానీ తక్కువ ఆదాయం వస్తున్నా.. దీనిని సరైన ప్లానింగ్ ద్వారా ఉపయోగిస్తే కుటుంబ అవసరాలు తీరడంతో పాటు సేవింగ్స్ కూడా చేస్తుంటారు. అయితే కొందరు ఎన్ని ప్రణాళికలు చేపట్టినా ప్రత్యేక అవసరాల కోసం డబ్బు అందదు. దీంతో ఇతరలు వద్ద అప్పు తీసుకుంటారు. మరికొందరు బ్యాంకు రుణం తీసుకుంటారు. ముఖ్యంగా ఇల్లు నిర్మించుకోవడానికి తీసుకున్న బ్యాంకు రుణం కనీసం 20 సంవత్సరాల పాటు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ చిన్న పని చేయడం వల్ల ఈ రుణంపై భారీగా తక్కువ వడ్డీని మాత్రమే చెల్లించే అవకాశం ఉంది. అదెలాగంటే?

    సాధారణంగా ఇల్లు నిర్మించుకోవడానికి కొందరు జీవిత లక్ష్యాంగా నిర్ణయించుకుంటారు. అయితే అనువైన సమయంలో అనుకున్న ఆదాయం లేకపోవడంతో బ్యాంకు రుణం తీసుకుంటారు. బ్యాంకు రుణం తీసుకోవడం వల్ల ఓ వైపు లోన్ తీరుస్తూనే మరోవైపు ఇల్లు నిర్మించుకోవచ్చు. అయితే దీనిపై బ్యాంకులు మినిమం వడ్డీ వేసినా.. కొందరికి భారంగానే ఉంటుంది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు గృహ రుణంపై 9 శాతం వడ్డీని విధిస్తున్నారు. అయితే రూ.20 లక్షల వరకు లోన్ తీసుకుంటే వీటిపై కనీసం రూ.30 లక్షల వరకు వడ్డీ పడుతుంది. అయితే ఈ వడ్డీ నుంచి రూ. 13 లక్షలు మాత్రమే చెల్లించే సదుపాయం ఒకటి ఉంది.

    ఉదాహరణకు 20 సంవత్సరాల కోసం రూ.20 లక్షల రుణం తీసుకున్నారనుకోండి. దీనిపై ప్రతినెలా రూ.22 వేలకు పైగా ఈఎంఐ నిర్ణయించుకుంటే.. 29 లక్షల వడ్డీని చెల్లించాలి. అయితే ఈఎంఐని రూ.22 వేలు కాకుండా పెంచుకుంటూ పోవడం వల్ల చాలా వరకు వడ్డీ భారం తగ్గుతుంది. ఉదాహరణకు 20 లక్షల మొత్తానికి నెలకు 12 ఈఎంఐ మాత్రమే కాకుండా అదనంగా మరికొన్ని ఈఎంఐలు చెల్లించడం ద్వారా అంటే 12 ఈఎంఐలు కాకుండా 15 ఈఎంలు చెల్లించడం ద్వారా మెయిన్ అమౌంట్ తగ్గుతుంది. దీంతో ఉన్న మొత్తానికి వడ్డీ తక్కువగా చెల్లించే అవకాశం ఉంటుంది.

    చాలా మంది ఒక లోన్ తీసుకున్న తరువాత సంవత్సరాల తరబడి చెల్లిస్తూనే ఉంటారు. కానీ ఇలా అదనంగా వస్తున్న డబ్బుతో ఈఎంఐలు తొందరగా పూర్తి చేయడం వల్ల చాల వరకు సేఫ్ గా ఉంటారు. అయితే ఇది అన్ని సమయాల్లో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే కొందరికి మితంగా ఆదాయం ఉంటుంది. మరికొందరికి అదనంగ ఆదాయం వచ్చే అవకాశం లేనప్పుడు ఈఎంఐ పెంచడం వల్ల పర్సనల్ ఖర్చులకు డబ్బులు అందుబాటులో ఉండవు. దీంతో అదనంగా అప్పులు చేయాల్సి వస్తుంది. అందువల్ల ఆర్థిక చెల్లింపుల విషయంలో సరైన ప్లానింగ్ ఉండాల్సిన అవసరం ఉంది. అయితే దీనిపై ముందుగా బ్యాంకు అధికారులను సంప్రదించి ఈఎంఐని పెంచుకునే అవకాశం ఉందా? లేదా? అనే విషయం గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి.