Navratri 2024 Day 5: దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు.. 5వరోజు అమ్మవారి అవతారం ఇదే.. ఎలా పూజించాలంటే?

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు బాలత్రిపుర సుందరి దేవీగా దర్శనమిస్తారు. ఈరోజు క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఉత్సవాల్లో 5వ రోజు దుర్గాదేవి స్కంధమాతగా దర్శనమిస్తారు. పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరు కుమారులు అని అందరికీ తెలుసు.

Written By: Srinivas, Updated On : October 7, 2024 12:05 pm

Navratri 2024 Day 5 Maa Skandamata

Follow us on

Navratri 2024 Day 5: దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 3న ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు 12 వరకు సాగనున్నాయి. ఉరూ వాడా వెలిసిన అమ్మవారి మండపాల వద్ద భక్తుల సందడి నెలకొంది. ఉదయం, సాయంత్రి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే సాయంత్రం దాండియా ఆటలు ఆడుతూ ఉల్లాసంగా ఉంటున్నారు. ప్రస్తుతం దసరా సెలవు కావడంతో విద్యార్థులు, కొందరు ఉద్యోగులు, మండపాల వద్దే ఉంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అమ్మవారి మండపాల వద్ద బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు. ఆది శక్తిగా పిలిచే అమ్మవారు వివిధ రూపాల్లో ఉంటారని భక్తులు నమ్ముతారు. అందువల్ల ప్రతిరోజూ అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేస్తారు. అయితే అక్టోబర్ 7న అమ్మవారు స్కంధ రూపంలో దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే?

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు బాలత్రిపుర సుందరి దేవీగా దర్శనమిస్తారు. ఈరోజు క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఉత్సవాల్లో 5వ రోజు దుర్గాదేవి స్కంధమాతగా దర్శనమిస్తారు. పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరు కుమారులు అని అందరికీ తెలుసు. వీరిలో కార్తీకేయ ఒకరు. అమ్మవారి రెండో కుమారుడు అయిన కార్తీకేయ అంటే ఎంతో ఇష్టం. కార్తీకేయుడు అమ్మవారిని స్కంధమాత రూపంలో కొలుస్తారు. ఈ నేథఫ్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు అమ్మవారు స్కంధమాతగా దర్శనిమిస్తారు. స్కంధమాతగా కనిపించే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయస్తారు.

స్కంధమాతగా దర్శనమిచ్చే అమ్మవారికి పూజలు చేయడం వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థుల మేధస్సు పెరగాలంటే ఈ రోజు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేయాలని అంటారు. ఈరోజు అమ్మవార నాలుగు చేతులతో దర్శననమిస్తారు. అలాగే తన ఒడిలో కార్తీకేయ స్వామిని కూర్చుండబెట్టుకుందారు. ఇంట్లో ఐశ్వర్యం పెరగాలన్నా.. ఎన్నో తప్పుల నుంచి విముక్తి లభించాలన్నా.. స్కంధ మాతను దర్శించుకోవాలని అంటారు. అలాగే స్కంధమాతగా ఉన్న అమ్మవారిని కొలవడం వల్ల తెలివి పెరుగుతుందని భావిస్తారు.

స్కంధమాతను పూజించాలని అనుకునేవారు ఉదయం స్నానమాచరించాలి. పవిత్ర జలాలతో పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత పుష్పాలు, పండ్లు సమర్పించాలి. అలాగే భోగ్ అనే నైవేద్యాన్ని సమర్పించాలి. ఇంట్లో వీలు కాని వారు దగ్గర్లోని అమ్మవారి మండపం వద్దకు వెళ్లి అమ్మవారిని పూజించాలి. అయితే మండపాలకకు వెళ్లాలనుకునేవారు తెల్లని దుస్తులు దర్శించడం వల్ల అమ్మవారు సంతోషంగా ఉంటారని అంటారు. తెలుపు ప్రశాంతతకు నిదర్శనం. అలాగే అమాయకత్వం, స్వచ్ఛతకు తెలుపును పేర్కొంటారు. దీంతో సోమవారం తెల్లటి దుస్తులు ధరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందుతారు.

అయితే స్కంధమాతలో ఉన్న అమ్మవారిని పూజించిన తరువాత ఈరోజు నిష్టతో ఉండడం మంచిది. ఎలాంటి చెడు ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈరోజు సోమవారం కూడా కావడంతో ఆ పరమ శివుడి అనుగ్రహం కూడా పొందుతారు. శివపార్వతులతో పాటు వారి కుమారుడు కార్తీకేయుడి అనుగ్రహం పొందాలంటే ఐదో రోజు అయినా అక్టోబర్ 7న అమ్మవారిని సేవించాలి.