IDFC First Bank & FHCL Merger : బ్యాంకులకు అనుబంధంగా ఉన్న కొన్ని ప్రైవేట్ సంస్థలు విలీనం అవున్నాయి. ఇప్పటి వరకు హెచ్ డీ ఎప్ సీ లిమిటెడ్ దాని బ్యాంకులో విలీనం అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఐసీఐసీఐ కూడా బ్యాంకులో కలిసి పోయింది. తాజాగా మరో బ్యాంకుకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ సంస్థ బ్యాంకులో విలీనం అవుతున్నట్లు ప్రకటించింది. ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అయితే బ్యాంకులో ఈ సంస్థ విలీనం అయినా మేనేజ్మెంట్, డైరెక్టర్ల నిర్వహణ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని ఆ సంస్థ ప్రకటించింది. ఇంతకీ ఆ సంస్థ ఏది? ఏ బ్యాంకులో విలీనం అవుతోంది? ఆ వివరాల్లోకి వెళితే..
దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో IDFC ఒకటి. ఇది బ్యాంకు వ్యవహారాలతో పాటు ఫైనాన్స్ సెక్టార్లోనూ కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా FHCLగా ఉంది. అయితే మిగతా బ్యాంకుల మాదిరిగానే రెండు సంస్థలు ఒక్కటి కాబోతున్నాయి. సెప్టెంబర్ 30న ఈ కార్యక్రమం పూర్తయి అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈ విలీనంపై డైరెక్టర్ ఆఫ్ బోర్డ్ నుంచి అనుమతి లభించింది.
రెండు సంస్థలు ఒక్కటి కాబోతున్న నేపథ్యంలో FHCL షేర్లు మారిపోనున్నాయి. ఈ సంస్థ బ్యాంకు కిందికి రావడంతో ఇప్పటి వరకు ఉన్న రూ.10 గా ఉన్న షేర్ రూ.155 ఫస్ట్ బ్యాంకు షేర్లుగా మారిపోతాయి. ఇక నుంచి వీటికి షేర్ల అలాట్ మెంట్ ను 2024 అక్టోబర్ 10ని రికార్డ్ డేట్ గా పేర్కొన్నారు. అయితే FHCL బ్యాంకులో విలీనం అయినా ఇది ప్రత్యేకంగానే కొనసాగుతుంది. దీని మేనేజ్మెంట్ తో సహా డైరెక్టర్లు అలాగే ఉంటారని స్పష్టం చేశారు. అయితే ఐడీఎఫ్ సీ లిమిటెడ్, ఐడీఎఫ్ సీ ఎఫ్ హెచ్ సీ ఎల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మాత్రం రద్దు అవుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
IDFC లో FHCL విలీన ప్రక్రియకు అక్టోబర్ 17 నుంచి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి కూడా లభించింది. ముందుగా దీని గురంచి జూలై 3న సమావేశం నిర్వహించారు. ఆ తరువాత 2023 డిసెంబర్ 27న విలీనానికి సంబంధించిన నో అబ్జక్షెన్ సర్టిఫికెట్ ను ఆర్బీఐ నుంచి తీసుకున్నారు. వాస్తవానికి 2024లో ఐడీఎఫ్ సీకి లైసెన్స్ వచ్చింది. దీంతో విలీన ప్రక్రియ ప్రారంభం అయింది. ఇప్పుడు FHCL కొత్తగా ఐడీఎఫ్ డీ ఫస్ట్ బ్యాంకు గా నిలవనుంది.
ఇదిలా ఉండగా ఐడీఎఫ్ సీ లిమిటెడ్ షేర్ హోల్డర్లు ఇక ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు షేర్ హోల్డర్లుగా మారిపోతారు. ఈ విలీన ప్రక్రియ సోమవారం పూర్తి కావడంతో వీటి షేర్లు ఏవిధంగా మారుతాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రూ.10 ఉన్న వీటి షేర్ విలువ 100 ఈక్వీటి షేర్లు రూ.155 కిందకి వస్తాయి. ఈ తరుణంలో రెండు విలీనం కావడంతో వీటి విలువ పెరుగుతుందా? అని చర్చించుకుంటున్నారు. గతంలో బ్యాంకులు, తమ సంస్థలను విలీనం చేసుకున్న తరువాత వాటి షేర్లు మారిపోయాయి.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Idfc fhcl going to merge fhcl shares from rs 10 per share will become rs 155 first bank shares
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com