Hyundai Grand I10 Car: కరోనా కాలం తరువాత ప్రతి ఒక్కరూ సొంత కారు ఉండాలనుకుంటున్నారు. పలు కార్ల కంపెనీలు సైతం మిడిల్ క్లాస్ పీపుల్స్ కుఅందుబాటులో ఉండే విధంగా మోడళ్లను తయారు చేస్తూ.. తక్కువ ధరకు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఇటీవల SUVలకు డిమాండ్ పెరిగిపోతుంది. కానీ వాటి ప్రైసెస్ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇదే సమయంలో హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ల కార్ల వైపు చూస్తున్నారు. ఇవి తక్కువ ధరతో పాటు మైలేజీ ఎక్కువ ఇస్తుండడంతో కార్ల వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. హ్యాచ్ బ్యాగ్ సెగ్మెంట్ల లో ప్రముఖంగా Hyundai Grand i10 Nios పేరు బాగా వినిపిస్తోంది. దీని వివరాలను తెలుసుకుందాం..
Hyundai కంపెనీ Grand i10 Nios అనే మోడల్ ను కొత్తగా రిలీజ్ చేసింది. ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు సెక్యూరిటీ ఫీచర్లు ఎక్కువగా ఉండడంతో దీనిపై ఆసక్తి చూపుతున్నారు. Grand i10 Nios ఫీచర్స్ విషయానికొస్తే ఇది 11997 సీసీ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. లీటర్ పెట్రోల్ కు 20.7 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 81.80 బీహెచ్ పీ పవర్ ను, 113.8 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే ఈ మోడల్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. ఇక సిఎన్ జీ విషయానికొస్తే ఒక కిలో పై 35 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇంజిన్ స్టార్ట్ -స్టాప్ బటన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, పవర్ విండోస్ 3 ఎయిర్ బ్యాగ్స్ ఈ కారులో ఉన్నాయి. Grand i10 Nios ఎక్స్ షోరూం ధర రూ.5,73,400 నుంచి ఉంది. ఢిల్లీలో ఆన్ రోడ్ కు రూ.6,98,048 చెల్లించాలి. ఈ కారును ఒకేసారి చెల్లించి కొనుగోలు చేయాలని అనుకోకపోతే లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. అయితే ఫైనాన్స్ లో తీసుకుంటే రూ.6,18,048 చెల్లించాల్సి ఉంటుంది.
లోన్ ద్వారా తీసుకోవాలనుకుంటే ముందుగా రూ.80,000 డౌన్ పేమెంట్ చెల్లించి కారును ఇంటికి తీసుకురావచ్చు. ఆ తరువాత ప్రతి నెల రూ.13,071 చెల్లించాలి. ఇలా 5 సంవ్సరాల పాటు చెల్లిస్తే రుణం తీరుతుంది. చిన్న బడ్జెట్ లో, తక్కువ ఈఎంఐల ద్వారా కారు కొనాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ గా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ ఇవ్వడంతో దీనిపై చాలా మంది ఇంట్రెస్ట్ పెడుతున్నారు.