Tata Punch : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. టాటా మోటార్స్ తమ అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన పంచ్ ఈవీపై ఏప్రిల్ నెలలో భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ సమయంలో టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) కొనుగోలు చేస్తే వినియోగదారులు గరిష్టంగా రూ.70,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లో నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. డిస్కౌంట్ గురించిన మరింత సమాచారం కోసం వినియోగదారులు తమ సమీపంలోని డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. టాటా పంచ్ ఫీచర్లు, డ్రైవింగ్ రేంజ్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.
Also Read : మారుతి ఫ్రాంక్స్ vs టాటా పంచ్.. మైలేజ్ ఎవరిది? సేఫ్టీ ఎవరికి ?
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణం
టాటా పంచ్ EVలో 2 బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది 25 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 82bhp గరిష్ట శక్తిని , 114Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండవది 35 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 122bhp గరిష్ట శక్తిని, 190Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. చిన్న బ్యాటరీతో కూడిన మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అయితే పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన మోడల్ 421 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
పంచ్ ఈవీ ధర ఎంతంటే
ఫీచర్ల విషయానికి వస్తే, పంచ్ EVలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, సన్‌రూఫ్ కూడా ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా పంచ్ EV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుండి ప్రారంభమై టాప్ మోడల్‌లో రూ.14.44 లక్షల వరకు ఉంటుంది.
Also Read : ఇలా కొంటే టాటా పంచ్ మీద రూ.1.71లక్షలు ఆదా