Hyundai Exter Sales: భారత్ లో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. చాలా మంది సొంతంగా వెహికల్ ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో ఏదీ బెస్ట్ అనే దాని కోసం సెర్చ్ చేస్తున్నారు. కొందరు తమ కార్యాలయాలతో పాటు సొంత అవసరాలకు అనుగుణంగా ఉండేలా కారును కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు వినియోగదారులకు అనుగుణంగా ఉండేలా, వారి అభిప్రాయాలకు దగ్గరగా ఉండేలా వెహికల్స్ ను తయారు చేస్తున్నారు. ఇలా హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఓ కారు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎంతలా అంటే ఇది రిలీజ్ అయిన ఒక్క ఏడాదిలోనే లక్ష యూనిట్లు అమ్ముడు పోయాయి. ఇంతకీ ఆ కారు ఏది? దానిని ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు?
దక్షిణ కొరియా కంపెనీకి చెందిన హ్యుందాయ్ భారత్ లో దూసుకుపోతుంది. హ్యుందాయ్ నుంచి ఇప్పటికే చాలా మోడళ్లు వచ్చాయి. కానీ ఒక్క ఫైనాన్స్ ఇయర్ లో ఈ కంపెనీకి ఓ మోడల్ ది బెస్ట్ కారుగా నిలిచింది. అదే ఎక్స్ టర్. హ్యుందాయ్ ఎక్స్ టర్ 2013 జూలై 10న దేశీయ మార్కెట్లోకి వచ్చింది. రిలీజ్ అయిన ఏడాదిలో ఎక్స్ టర్ సేల్స్ 2024 జూన్ వరకు 1,01,661 యూనిట్లు జరిగాయి. ఎక్స్ టర్ ప్రారంభం నుంచే సేల్స్ లో ముందుంటూ వచ్చింది. దీంతో హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు 3,88,725 గా నమోదైంది. అంటే మొత్తం యూనిట్లలో 18 శాతం వాటాను కలిగి ఉంది.
హ్యుందాయ్ ఎక్స్ టర్ పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. 81.8 బీహెచ్ పీ పవర్ తో పాటు 113.8 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్ టర్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. సీఎన్ జీ వెర్షన్ మాత్రం కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో మూవ్ అవుతుంది. మాన్యువల్ గేర్ బాక్స్ లో లీటర్ పెట్రోల్ కు 19.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్ జీ వెర్షన్ లో 27.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో సేప్టీ ఫీచర్లు ఆకర్షిస్తాయి. 6 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలటీ కంట్రోల్ వంటివి ఉన్నాయి.
హ్యుందాయ్ ఫీచర్ల విషయానికొస్తే విభిన్న రకాల డిజైన్లతో ఆకర్షిస్తుంది. ఎక్స్ టర్ సరైన బాక్సీ ఎస్ యూవీని కలిగి ఉంటుంది. ముందు భాగంలో స్ల్పిట్ హెడ్ లైట్ డిజైన్ ను ఇందులో అమర్చారు. సిగ్నేచర్ హెచ్ ఆకారపు డీఆర్ఎల్ ఆకర్షిస్తాయి. సిల్వర్ స్కడ్ ప్లేట్, బ్యాడ్జ్ బ్యానెట్ పై ఉంటుంది. బ్యాడ్జింగ్ టాప్ లైటింగ్ గ్రిల్ మధ్యన ఉంటుంది. రెండు వైపుా ఫ్లెర్డ్ వీలర్ చెస్, ప్లాస్టిక్ క్లాడింగ్ ఆకర్షిస్తాయి. మార్కెట్లో మారుతి ఇగ్నిస్ వంటి కార్లతో ఎక్స్ టర్ విపరీతమైన పోటీ ఇస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్ టర్ ను రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దీనిని 2013 జూలై 10న అందుబాటులోకి తీసుకొచ్చారు. SUVఫార్మాట్ లో క్రెటా, వెన్యూ తరువాత ఎక్స్ టర్ అత్యధికంగా విక్రయాలు జరుపుకున్న మోడల్ గా రికార్డు కెక్కింది. సాధారణంగానే ఎస్ యూవీల కు డిమాండ్ విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రారంభించినప్పటి నుంచి దీనిని ప్రతి నెల 20 నుంచి 22 వేల యూనిట్లు విక్రయించాలని అంచనా వేశారు. అనుకున్నట్లుగానే చివరి త్రైమాసికం (ఏప్రిల్ -జూన్ 2004)లో 22,361 యూనిట్లు విక్రయించారు. దీంతో మొత్తంగా లక్ష యూనిట్ల అమ్మకాలతో రికార్డుల్లోకి ఎక్కింది.