https://oktelugu.com/

Hyundai Creta N Line: హ్యుందాయ్ నుంచి Creta N line..ఫీచర్లు దద్దరిల్లాయి..

క్రెటా ఎన్ లైన్ లో పనోరమిక్ రూఫ్, వెంటిటేలటెడ్ ఫ్రంట్ సీట్లు ఆకర్షిస్తాయి. ఇందులో ఇనిస్ట్రుమెంటేషన్, ఇన్ఫోటైన్మెంట్ కోసం డ్యూయెల్ 10.25 అంగుళాల స్క్రీన్లు ఉన్నాయి. డ్యూయెల్ డాష్ క్యామ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ ఉన్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : March 16, 2024 5:46 pm
    Hyundai Creta N Line

    Hyundai Creta N Line

    Follow us on

    Hyundai Creta N Line: దక్షిణ కొరియా కంపెనీ హ్యుందాయ్ నుంచి వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. హ్యుందాయ్ నుంచి వచ్చిన క్రెటా ఇప్పటికే ఆదరణ పొందింది. ఇప్పుడు కొత్తగా Creta N line మార్కెట్లోకి వచ్చింది. ఇప్పడున్న వారు ఎక్కువగా ఎస్ యూవీ కార్లను కోరుకుంటున్నారు. ఆ తరహాలో ఫేస్ లిప్ట్ గా వచ్చిన ఈ మోడల్ డిజైన్, పనితీరు ఇంప్రెస్ చేస్తోంది. ఈ కారు పూర్తి వివరాల్లోకి వెళ్లి చూస్తే..

    క్రెటా ఎన్ లైన్ లో పనోరమిక్ రూఫ్, వెంటిటేలటెడ్ ఫ్రంట్ సీట్లు ఆకర్షిస్తాయి. ఇందులో ఇనిస్ట్రుమెంటేషన్, ఇన్ఫోటైన్మెంట్ కోసం డ్యూయెల్ 10.25 అంగుళాల స్క్రీన్లు ఉన్నాయి. డ్యూయెల్ డాష్ క్యామ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ ఉన్నాయి. సౌండింగ్ కోసం 8 స్పీకర్ ఆడియో సిస్టమ్ బాగుంటుందనిపిస్తుంది. ఇందులో ప్రయాణించే వారి రక్షణ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్ లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెవల్ 2 ఆడాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    ఈ మోడల్ లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు 158 బీహెచ్ పీ, 252 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేరస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు ఉన్న ఈ కారు లీటర్ కు 18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో ఆటోమేటిక్ పవర్ ట్రయిన్ లు, ఎకో, నార్మల్, స్పోర్ట్ డ్రైవింగ్ మోడల్ లో, స్నో, ఇసుక మడ్ ట్రాక్షన్ వంటి మోడ్ లను కలిగి ఉంది. ఈ మోడల్ లో స్టీరింగ్ సెటప్, కొత్త ఎగ్జాస్ట్ ను చూడొచ్చు. కొత్త క్రెటా ఎన్ లైన్ లో టాప్ స్పెక్ క్రెటా మాదిరిగానే ఉంటాయి.

    క్రెటా ఎన్ లైన్ ధర విషయానికొస్తే రూ.16.82 లక్షల ప్రారంభం నుంచి రూ.20.30 లక్షల వరకు విక్రయించనున్నారు. సాధారణ క్రెటాతో పోలిస్తే ఇది రూ.30 వేలు ఎక్కువ. కానీ దీని ఫీచర్లను చూస్తే అది తక్కువే అనిపిస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఎస్ యూవీని ఇప్పటికే ఆదరించారు. ఇప్పుడీ మోడల్ వినియోగదారులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అంటున్నారు. అయితే దీని అమ్మకాలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.