https://oktelugu.com/

Devara: దేవర సినిమా లో కీలక పాత్ర లో నటించనున్న తెలుగు స్టార్ హీరోయిన్…

ప్రస్తుతానికి ఆమె పాత్రని సస్పెన్స్ లో ఉంచి ఒకేసారి థియేటర్ లో రివిల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ పాత్ర సినిమా మొత్తాన్ని టర్న్ చేసే పాత్ర కావడంతో దానికోసం సమంతను తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

Written By: , Updated On : March 16, 2024 / 05:52 PM IST
Devara

Devara

Follow us on

Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా మీద ప్రస్తుతం పాన్ ఇండియాలో భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమాతో ఎన్టీఆర్ తనని తాను పాన్ ఇండియా స్టార్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చినప్పటికీ, ఇంతకుముందు ఆయన చేసిన త్రిబుల్ ఆర్ సినిమాలో ఇద్దరు హీరోలు ఉండటం వల్ల సపరేట్ గా తనకు గుర్తింపు రాలేదు.

కాబట్టి ఈ సినిమాతో ఈసారి భారీ స్థాయిలో తనను తాను ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాని ఎన్టీఆర్ దగ్గరుండి మరి తెరకెక్కిస్తూ భారీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టే దిశగా ముందుకు తీసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో తెలుగులో స్టార్ హీరోయిన్ లో గుర్తింపు పొందిన సమంత కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

అయితే ప్రస్తుతానికి ఆమె పాత్రని సస్పెన్స్ లో ఉంచి ఒకేసారి థియేటర్ లో రివిల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ పాత్ర సినిమా మొత్తాన్ని టర్న్ చేసే పాత్ర కావడంతో దానికోసం సమంతను తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ పాత్రలో సమంత ఎంత వరకు నటించి మెప్పిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి రెండో పార్ట్ కూడా రాబోతున్న విషయం మనకు తెలిసిందే…

అయితే సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూట్ ని కూడా ఇప్పుడే కొంతవరకు పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తూ ప్రేక్షకులందరిని ఎంటర్ టైన్ చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సంవత్సరం ఎన్టీఆర్ పాన్ ఇండియాలో తన సత్తాని భారీ లెవెల్ లో చాటుకోబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో ఎన్టీఆర్, కొరటాల శివ ఏ రేంజ్ లో హిట్టు కొడతారు అనేది…