https://oktelugu.com/

Hyundai Car: ఈ కారుపై రూ.45,000 తగ్గింపు.. నెలాఖరు వరకే ఛాన్స్..

MY 2023 మోడల్ ను రూ.45,000 తగ్గింపు ధరతో కొనుగోలు చేయొచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 23, 2024 / 02:08 PM IST

    Hyundai Grand i 10

    Follow us on

    Hyundai : లక్షల రూపాయలు పెట్టి కారు కొనాలనుకునేవారు డిస్కౌంట్ వస్తే బాగుండు అని అనుకుంటారు. పండుగల సీజన్లలో, ప్రత్యేక రోజుల్లో కొన్ని కంపెనీలు భారీ ఆఫర్లను ప్రకటిస్తాయి. కానీ కొన్ని కంపెనీలు సాధారణ రోజుల్లోనూ సేల్స్ పెంచుకునేందుకు తగ్గింపు ధరను ప్రకటిస్తాయి. తాజాగా హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఓ కారును రూ.45,000 తగ్గింపు ధరతో విక్రయిస్తోంది. 2024 కొత్త ఏడాదిలో కార్ల ధరలు పెరిగాయి. కానీ ఇలాంటి సమయంలో భారీ తగ్గింపు ధర ప్రకటించడంపై ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

    దేశీయ కార్ల ఉత్పత్తిలో హ్యుందాయ్ పోటీ పడుతోంది. ఇప్పటికే ఎన్నో మోడళ్లను అందించిన హ్యుందాయ్ తాజాగా గ్రాండ్ ఐ 10 పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లో గ్రాండ్ ఐ 10 అలరించింది. ఇది హ్యాచ్ బ్యాక్ కారు అయినా నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. గ్రాండ్ ఐ 10 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 82 bhp పవర్ ను అందిస్తుంది. అలాగే 114Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ CNG వెర్షన్ లో కూడా లభిస్తుంది. ఆ సమయంలో 68 bhp 95Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

    5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ అందించే ఇందులో రెండు పవర్ ట్రెయిన్ లు ఉండడం విశేషం. ఇక కారు డిజైన్ వినియోగదారులను అంప్రెస్ చేస్తుంది. ఇందులో 3.5 అంగుళాల స్పీడో మీటర్, వైర్ లెస్ ఛార్జర్ ఫీచర్స్ ఉన్నాయి. 8.0 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్టు ఉంది. నియోస్ ఎంబాసింగ్, లెదర్ తో కూడా స్టీరింగ్ ఈ కారులో ఆకర్షిస్తాయి.

    ప్రస్తుతం గ్రాండ్ ఐ 10 ను రూ.5.92 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దీనిపై మొత్తం రూ.45,000 ఆఫర్లను ప్రకటించారు. ఇది MY 2023, MY 2024 అనే మోడళ్లకు వర్తిస్తుంది. MY 2024 మోడల్ కు ఎక్ఛేంజ్ బోనస్ రూ.10,000, సీఎన్జీ వేరియంట్ కు రూ.20,000 నగదు తగ్గింపును ప్రకటించారు. అలాగే MY 2023 మోడల్ కు రూ.35,000 నగదు తగ్గింపుతో పాటు రూ.10,000 ఎక్ఛ్జేంజ్ బోనస్ ఇవ్వనున్నారు. అంటే MY 2023 మోడల్ ను రూ.45,000 తగ్గింపు ధరతో కొనుగోలు చేయొచ్చు.