https://oktelugu.com/

Hyundai Car Discounts : రూ. 4 లక్షల వరకు డిస్కౌండ్.. హ్యుందాయ్ కంపెనీ బంపర్ ఆఫర్…

పెట్రోల్, డీజిల్ కార్లపై మాత్రమే కాకుండా కోనా అనే ఎలక్ట్రిక్ కారుపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించిందిమారుతి. ఈ ఈవీ 39.2 kWh కలిగి ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 452 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. దీనిపై రూ. 4లక్షల డిస్కౌంట్ ను ప్రకటించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 22, 2024 / 04:47 PM IST

    Hyunda Taksan

    Follow us on

    Hyundai Car Discounts : దేశంలో దక్షిణ కొరియా కంపనీకి చెందిన హ్యుందాయ్ కారు కంపెనీ తన హవా చూపిస్తోంది. ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు అందుబాటులోకి వచ్చి ఆకట్టుకున్నాయి. అయితే ఎన్ని కార్లు వచ్చిన వేటికవే ప్రత్యేకతను చాటుకున్నాయి. అంతేకాకుండా ఈ కంపెనీ తీసుకొచ్చే ఏ కారైనా వినియోగదారులకు సరసమైన ధరల్లో లభ్యమవుతుందనే అభిప్రాయం ఉంది. అయినా కొన్నిసందర్భంగా ఈ కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తూ ఆకర్షిస్తుంటారు. తాజాగా కొన్ని మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే..

    2024 మార్చి నుంచే హ్యుందాయ్ తన కార్లపై డిస్కౌంట్లను ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా వెన్యూ, టక్సన్, అల్కాజర్ తో పాటు కోనా అనే ఎలక్ట్రిక్ కారుపై డిస్కౌంట్లను ప్రకటించింది. హ్యుందాయ్ వెన్యూ ప్రస్తుతం రూ.12.08 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ రూ.13.90 లక్షలు ఉంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. దీనిపై రూ.30 వేల వరకు తగ్గింపును ప్రకటించారు. అయితే స్టాండర్డ్ వెన్యూ పై రూ.35,000 వరకు ప్రయోజనం పొందవచ్చు.

    హ్యుందాయ్ అల్కాజర్ 1.5 లీటర్ పెట్రోల్ తో పాటు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. దీనిని రూ.16.78 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.21.28 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ మోడల్ పై రూ.55,000 డిస్కౌంట్ ను ప్రకటించారు. ఈ మోడల్ కారు లో 6 నుంచి 7 గురు ప్రయాణికులు సురక్షితంగా వెళ్లవచ్చు. టక్సన్ కారు 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఈ కారు పెట్రోల్ మోడల్ రూ.29.02 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.31.67 లక్షల వరకు విక్రయిస్తున్నారు. దీనిపై రూ.2 లక్షల వరకు మాఫీ పొందవచ్చు. అయితే 2023 మోడల్ పై మాత్రమే డిస్కౌంట్ వర్తిస్తుంది.

    పెట్రోల్, డీజిల్ కార్లపై మాత్రమే కాకుండా కోనా అనే ఎలక్ట్రిక్ కారుపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించిందిమారుతి. ఈ ఈవీ 39.2 kWh కలిగి ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 452 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. దీనిపై రూ. 4లక్షల డిస్కౌంట్ ను ప్రకటించారు. డిజైన్ తో పాటు అధునాతన ఫీచర్స్ ఈ కారులో అలరిస్తున్నాయి.