https://oktelugu.com/

Viral Video: ఏనుగు వచ్చింది.. పులి భయపడింది.. చూసి తీరాల్సిన వీడియో

ఆకలితో ఉండే ఓ పులి ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో పక్కన పొదల నుంచి ఒక శబ్దం వస్తుంది. ఏనుగుల గుంపు వస్తున్నట్లు గమనించిన ఆ పులి.. ఒక్కసారిగా భయపడిపోయి.

Written By:
  • Dharma
  • , Updated On : April 22, 2024 / 04:48 PM IST

    Viral Video

    Follow us on

    Viral Video: పులి వేట గురించి వేరేగా చెప్పనవసరం లేదు. బరిలో దిగిందంటే ఎలాంటి జంతువైనా నోటికి చిక్కాల్సిందే. ఆకలిని తీర్చుకునే క్రమంలో చిన్న జంతువులను వెంటాడి వేటాడి చీల్చి చెండాడుతుంటాయి. అలాంటి పులులకు కొన్నిసార్లు చిన్న జంతువుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది.ఎంత పెద్ద పులి అయినా ఒక్కోసారి భయపడాల్సి ఉంటుంది. ఇటువంటి దృశ్యాలే తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. తాజాగా ఒక పులికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వేటకు దిగిన పులికి ఏనుగులు గుంపు ఎదురుపడింది. ఇంకేముంది ఆ పులి చేసిన పనికి ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు.

    ఆకలితో ఉండే ఓ పులి ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో పక్కన పొదల నుంచి ఒక శబ్దం వస్తుంది. ఏనుగుల గుంపు వస్తున్నట్లు గమనించిన ఆ పులి.. ఒక్కసారిగా భయపడిపోయి.. ఏనుగులకు కనిపించకుండా పక్కనే దాక్కుంటుంది. రోడ్డు పక్క నుంచి వచ్చిన మూడు ఏనుగులు వరుసగా ఒకదాని వెనుక మరోటి రోడ్డు దాటుకొని అవతలి వైపు వెళ్ళిపోతాయి. అవి వెళ్లే వరకు దాక్కునే పులి.. మెల్లగా అటు ఇటు తిరుగుతుంది. ఏనుగులు వెళ్లిపోయాయని రిలాక్స్ అవుతుంది.

    ఇంతలో పొదల నుంచి మరో శబ్దం వస్తుంది. పక్కన ఉన్న పులి గమనించేసరికి ఒక ఏనుగు ఒక్కసారిగా వస్తుంది. దీంతో పులి అక్కడ నుంచి భయపడుతూ పరుగు పెడుతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అడవికి రాజు అంటే ఏనుగే అంటూ ఎక్కువ మంది కామెంట్ పెడుతున్నారు. వివిధ రకాల ఎమోజీలతో చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.