Hyderabad : సామాన్యుల నుంచి సంపన్నుల వరకు సొంతిల్లు అనేది ఒక కల. సొంతింటిలో తన కుటుంబంతో కలిసి ఉండాలనే సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆకాంక్ష. ఎవరిస్థాయిని బట్టి వారు ఇండ్లు కొనడం, నిర్మాణాలు చేపట్టడం లాంటివి చేస్తుంటారు. అయితే పల్లె నుంచి పట్టణం దాకా ప్రస్తుతం ఇండ్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇల్లు కట్టేందుకు అయ్యే మెటీరియల్ ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే పెద్ద పెద్ద పట్టణాల్లో ఇల్లు కొనాలంటే తలకు మించిన భారమే. మరి దేశంలోని టాప్ సిటీల్లో ఎక్కడ భారం తక్కువ ఉందో తెలుసా.. అయితే ఇది చదవండి..
దేశంలో ఇండ్ల కొనుగోలు భారం తక్కువగా ఉన్న సిటీలపై నైట్ ఫ్రాంక్ ఇండియా అనే సంస్థ ఒక సర్వే చేసింది. ఇటీవల ఆ నివేదికను విడుదల చేసింది. 2024 లో టాప్ ఎనిమిది నగరాల్లో ఇది స్థిరంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2023 ఆఖరు నుంచి 2024 ప్రథమార్థం వరకు స్థిరంగా ఉన్న వడ్డీ రేట్ల ఆధారంగా దీనిని నిర్ణయించారు. ఎనిమిది నగరాల్లో మొత్తంగా కుటుంబాలు తమ ఆదాయంలో ఇంటి ఈఎంఐ కోసం ఎంత వెచ్చిస్తున్నారనే దానిపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. సర్వే ఆధారంగా ఒక నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ఈఎంఐ, ఆదాయ నిష్ఫత్తిని సూచిస్తున్నది.
నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ చేసిన సర్వే ప్రకారం దేశంలో అహ్మదాబాద్ 21 శాతం నిష్ఫత్తితో అత్యంత తక్కువైన హౌసింగ్ మార్కెట్ గా వెల్లడైంది. ఇక పుణె, కొల్ కతా దీనికి సమీపంలో ఉన్నాయి. ఈ రెండు ప్రధాన నగరాల్లో 24% గా నమోదైంది. ఇక ముంబై ఏకంగా 51 శాతం నిష్పత్తిని నమోదు చేసింది. దీని సరసన హైదరాబాద్ కూడా నిలిచింది. ఇక్కడ కూడా 51 శాతం నిష్ఫత్తితో అత్యంత తక్కువ సరసమైన నగరంగా నిలిచింది.
ఇక నైట్ ఫ్రాంక్ ఇండియా సూచిక ప్రకారం నగరాల్లోని కుటుంబాలు ఇంటి ఈఎంఐల కోసం 40 శాతం వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఇది 50 శాతం దాటితే అతి ఎక్కువ భారంగా పరిగణిస్తారు. ఇక 2019 నుంచి అన్ని మార్కెట్లలో అఫర్టబులిటీ పెరిగింది. అహ్మదాబాద్ లో 5 శాతం నుంచి హైదరాబాద్ లో 26 శాతం వరక ఆయా మార్కెట్లలో ధరలు విపరీతంగా పెరిగాయి. ఇక 2019 నుంచి చూసుకుంటే ముంబై గణనీయమైన పెరుగదలను నమోదు చేసింది. ఇక కోల్ కతా మార్కెట్ విలువ 2019లో 32 శాతం నుంచి 2024లో 24 శాతానికి మెరుగుపడింది. బెంగళూరు ఇదే స్థోమత స్థాయిలు ఇదే కాలంలో 6 శాతం మేర పెరిగాయి.
ఆయా నగరాల్లో సగటును కుటుంబాల ఆదాయం, వారు ఇంటి కోసం కట్టే ఈఎంఐల ఆధారంగా ఈ నివేదికను నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించింది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాలను పరిగణనలోకి తీసుకుంది. ఇందులో ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, కోల్ కతా, చెన్నై, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాలు ఉన్నాయి. ఈ అగ్రశ్రేణి నగరాల్లో సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కలగా ఉంటుంది. అయతే ఏ మేరకు ప్రస్తుతం ఉన్న రేట్లు అందుబాటులో ఉన్నాయనే దానిపై ఒక నివేదికను సిద్ధం చేసింది. ఇక హైదరాబాద్ అతి సరసమైన ధరలతో సెకండ్ ప్లేస్ ను సొంతం చేసుకుంది. మొదటి స్థానంలో ముంబై కొనసాగుతున్నది. రియల్ మార్కెట్ పరంగా చూసుకున్నా ప్రస్తుతం హైదరాబాద్ టాప్ నగరాలతో పోటీ పడుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ రంగం విస్తరిస్తున్నది. టాప్ రియల్టీ కంపెనీలు పెట్టుబడులు పెట్టి, కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.