https://oktelugu.com/

Naga chaitanya – Sobhita : సమంత చేసిన తప్పే శోభిత కూడా చేసింది… మరి నాగ చైతన్య ఎందుకు పెళ్లి చేసుకుంటున్నట్లు!

సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదు. అందుకే పెళ్ళై నాలుగేళ్లు అవుతున్నా ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు అనేది ఒక ఆరోపణ. అలాగే సమంత తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్ పెట్టుకుందని కూడా ప్రచారం చేశారు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 9, 2024 / 06:13 PM IST

    _Samantha vs Naga chaitanya

    Follow us on

    Samantha vs Naga chaitanya : సమంత-నాగ చైతన్య మధ్య మనస్పర్థలు ఎందుకు వచ్చాయంటే పలు ఊహాగానాలు వినిపించాయి. అయితే సమంత మీద వచ్చిన ఆరోపణలు శోభిత మీద కూడా ఉన్నాయి. మరి ఆయన శోభితను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా వీరిద్దరి పెళ్లి గురించి చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో సమంత – నాగ చైతన్య విడాకుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సమంత – నాగ చైతన్య జంటకు అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఉంది. టాలీవుడ్ క్యూట్ కపుల్ అనిపించుకున్న వీరు, ఎందుకు విడిపోయారో తెలియదు. కానీ అప్పట్లో సమంత ప్రవర్తన వల్లే నాగ చైతన్య తో గొడవలు అయ్యాయని ప్రచారం జరిగింది.

    సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదు. అందుకే పెళ్ళై నాలుగేళ్లు అవుతున్నా ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు అనేది ఒక ఆరోపణ. అలాగే సమంత తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్ పెట్టుకుందని కూడా ప్రచారం చేశారు. సమంత-ప్రీతమ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంకొన్ని కారణాలు కూడా తెరపైకి వచ్చాయి.

    ముఖ్యంగా సమంత కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా నటించడం నాగ చైతన్య కు నచ్చ లేదనే వాదన వినిపించింది. అక్కినేని కుటుంబ గౌరవం పట్టించుకోకుండా సమంత అటువంటి సన్నివేశాల్లో నటించడం నాగ చైతన్యను ఇబ్బంది పెట్టిందని కథనాలు వెలువడ్డాయి. సమంతతో నాగ చైతన్యకు విబేధాలు రావడానికి ఇదే కారణమనే టాక్ నడిచింది. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్లో సమంత బోల్డ్ సీన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇది నిజం కాదని తాజా పరిణామంతో తేటతెల్లం అయ్యింది.

    మరి అదే నిజమైతే శోభితను రెండో వివాహం చేసుకోడానికి నాగ చైతన్య సిద్ధం అయ్యేవాడు కాదు. ఎందుకంటే శోభిత తన కెరీర్లో దారుణమైన బోల్డ్ సీన్స్ లో నటించింది. లిప్ లాక్ సీన్స్ అయితే లెక్కే లేదు. బోల్డ్ అండ్ ఇంటిమేట్ సన్నివేశాల్లో మొహమాటం లేకుండా నటించింది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో సమంత కంటే దారుణమైన శృంగార సన్నివేశాల్లో నటించింది. సమంత బోల్డ్ సీన్స్ చేయడమే సమస్య అయితే శోభిత విషయంలో కూడా నాగ చైతన్య అలానే ఆలోచించాలి కదా. కానీ నాగ చైతన్య శోభిత చేసిన చిత్రాలను పట్టించుకోలేదు.

    పరిశ్రమలో ఇవన్నీ కామనే కాబట్టి సమంత – నాగ చైతన్య విడిపోవడానికి ఆమె చేసిన బోల్డ్ సీన్స్ కాదని రుజువైంది. వారు విడిపోవడానికి కారణం ఏదైనా సరే అది వారి వ్యక్తిగతం. వేరు వేరు దారులు ఎంచుకుని జీవితంలో ముందుకు వెళ్లారు. నాగ చైతన్య ఒక అడుగు ముందుకు వేశాడు. శోభిత ధూళిపాళ్లతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నాడు. సమంత మాత్రం ఒంటరిగానే ఉంటున్నారు. కెరీర్ పై దృష్టి పెట్టింది. ఆమెకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్లే కనిపిస్తుంది.

    సమంత నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధం అవుతుంది. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కి హనీ బన్నీ ఇండియన్ వెర్షన్. అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 7 నుండి స్ట్రీమ్ కానుంది. వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. అలాగే సమంత మా ఇంటి బంగారం టైటిల్ తో ఒక సినిమా ప్రకటించింది. ఈ చిత్రాన్ని సమంత నిర్మిస్తూ నటిస్తుంది. ఇక నాగ చైతన్య తండేల్ టైటిల్ తో ఎమోషనల్ లవ్ డ్రామా చేస్తున్నాడు.