Rahul Roy : కొత్త ఆలోచనలకు పదును.. ఐదు నెలల్లో రూ. 268 కోట్ల సంపాదన.. ఎవరో తెలుసా..?

రాహుల్ కు మొదటి నుంచి సొంతంగా ఎదగాలనే కోరిక బలంగా ఉండేది. అందుకోసం ఎంతో ఆలోచించేవాడు. ఇక ఉద్యోగం మానేశాక తానే ఒక కంపెనీ మొదలు పెట్టాలనే ఆలోచనకు వచ్చాడు రాహుల్ రాయ్. ఇక వెంటనే భారత్ కు చేరుకున్నాడు. 2020లో నాడు కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దేశమంతా లాక్ డౌన్ ఉంది. అప్పుడే క్రిఫ్టో కరెన్సీ పై చర్చ జోరుగా దేశంలో కొనసాగుతున్నది.

Written By: NARESH, Updated On : August 9, 2024 6:27 pm
Follow us on

Rahul Roy : జీవితంలో అనుకున్నది సాధిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. చాలా మంది తాము అనుకున్నది సాధించడానికి, తమ కలలను నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు. ఇందుకోసం నిద్రాహారాలు మాని తమ లక్ష్యం వైపు అడుగులు వేస్తుంటారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తమ గమ్యస్థానం చేరుకుంటారు. అలాంటి వ్యక్తే ఈ రాహుల్ రాయ్.. ఆయన ఎవరనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి.. మీకే తెలుస్తుంది ఆయన ప్రయాణం.

జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలని అందరికీ ఉంటుంది. సమయానికి అనుగుణంగా మనం తీసుకునే నిర్ణయాలే మన విజయానికి నాందిగా మారుతాయి. అలాంటి వారిలో ముందుంటాడు క్రిఫ్టో హెడ్జ్ ఫండ్, గామా పాయింట్ క్యాపిటల్ కో ఫౌండర్ రాహుల్ రాయ్. బాంబే ఐఐటీలో ఇంజినీరింగ్ విద్య కోసం 2015 లో చేరాడు. అక్కడ విద్యాభ్యాసం పూర్తి కాకుండానే వదిలేశాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లి అక్కడ ఎకనామిక్స్ కోర్సులో చేరాడు. ఎకానమిక్స్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికాలోని మోర్గాన్ స్టాన్సీలో ఫారిన్ ఎక్స్చేంజ్ మాక్రో హెడ్జ్ ఫండ్స్ టీం లో సభ్యుడిగా చేరాడు. అక్కడ విశ్లేషకుడిగా ఉద్యోగం సంపాదించాడు. ఏడాది తర్వాత 2020లో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశాడు.

ఉద్యోగం వద్దనుకొని..
రాహుల్ కు మొదటి నుంచి సొంతంగా ఎదగాలనే కోరిక బలంగా ఉండేది. అందుకోసం ఎంతో ఆలోచించేవాడు. ఇక ఉద్యోగం మానేశాక తానే ఒక కంపెనీ మొదలు పెట్టాలనే ఆలోచనకు వచ్చాడు రాహుల్ రాయ్. ఇక వెంటనే భారత్ కు చేరుకున్నాడు. 2020లో నాడు కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దేశమంతా లాక్ డౌన్ ఉంది. అప్పుడే క్రిఫ్టో కరెన్సీ పై చర్చ జోరుగా దేశంలో కొనసాగుతున్నది. అంతకుముందే డిజిటల్ అసెస్ట్ తో పాటు బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై రాహుల్ కు విస్తృత అవగాహన, ఆసక్తి ఉంది. వెంటనే తన మిత్రులు ఈష్ అగర్వాల్, సనత్ రావ్ లతో కలిసి క్రిఫ్టో హెడ్జ్ ఫండ్, గామా పాయింట్ క్యాపిటల్ ను జనవరి, 2021లో ప్రారంభించాడు. ఆ అడుగే ఆయనను ఎక్కడికో తీసుకెళ్లింది.

ఇక ఆ తర్వాత రాహుల్ రాయ్ ఆలోచన ప్రకారం క్రిఫ్టో హెడ్జ్ ఫండ్, గామా పాయింట్ క్యాపిటల్ రూ. 256 కోట్లకు బ్లాక్ టవర్ క్యాపిటల్ మే 2021న కొనుగోలుచేసింది. కొత్తగా ప్రారంభమైన కంపెనీ ఇంత మొత్తంలో సంపాదించడం అంటే మాములు విషయం కాదు. ఇక ఆ తర్వాత బ్లాక్ టవర్ క్యాపిటల్ లోనే మార్కెట్- న్యూట్రల్ కి కో హెడ్ గా రాహుల్ రాయ్ చేరాడు. ఇక ప్రస్తుతం ఈ కంపెనీ బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో పెట్టుబడి పెడుతుంది. ఏదైనా సాధించాలని ఆశయం ఉంటే సరిపోదు.. దాని కోసం శ్రమించాలి. దీనినే రాహుల్ రాయ్ నమ్ముతారు. తాను మొదలుపెట్టిన సంస్థ రూ. 256 కోట్లకు విక్రయించి సంచలనంగా ఎదిగాడు రాహుల్ రాయ్. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాడు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ఐఐటీ ని మధ్యలోనే వదిలేసి వెళ్లిన ఓ కుర్రాడు ఇండియాకు తిరిగి వచ్చి ఇంత పెద్ద కంపెనీని ఏర్పాటు చేయడం మాములు విషయం కాదు. ఆలోచనలకు పదును పెడితే ఎవరైనా విజయం సాధించవచ్చని, అనుకున్నది పొందవచ్చుననే మాటకు నిలువెత్తు సాక్ష్యం రాహుల్ రాయ్. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలిచినప్పుడే ఆ విజయానికి ఒక రూపం ఉంటుంది. యువత తాము కన్న కలలు సాధించుకోవడానికి రాహుల్ రాయ్ లాంటి వ్యక్తులు ఆదర్శంగా నిలుస్తుంటారు.