https://oktelugu.com/

AIG Hospitals up for sale: అమ్మకానికి మరో ప్రముఖ హాస్పిటల్స్ గ్రూప్.. డీల్ విలువ ఎంతంటే?

AIG Hospitals up for sale: కాదేది అమ్మడానికి అనర్హం.. ఓ వైపు కరోనా దెబ్బ.. మరో ఆర్థిక కల్లోలాలకు ప్రభుత్వాల నుంచి వ్యాపారవేత్తల వరకూ అందరూ కుదేలవుతున్నారు. వ్యవస్థలకు వ్యవస్థలే కుప్పకూలిపోతున్నాయి. అప్పుల కోసం అందరూ అర్రులు చాస్తున్న పరిస్థితి. డబ్బులున్న మహారాజులదే ఇప్పుడు రాజ్యం.. అప్పులపాలైన వారంతా ఇప్పుడు ఆస్తులు తెగనమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రి కూడా విక్రయానికి సిద్ధమైంది.దానికి ఆర్థిక ఇబ్బందులా? లేక నిర్వహణ చేయలేక అమ్ముకుంటున్నారో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2021 / 12:23 PM IST
    Follow us on

    AIG Hospitals up for sale: కాదేది అమ్మడానికి అనర్హం.. ఓ వైపు కరోనా దెబ్బ.. మరో ఆర్థిక కల్లోలాలకు ప్రభుత్వాల నుంచి వ్యాపారవేత్తల వరకూ అందరూ కుదేలవుతున్నారు. వ్యవస్థలకు వ్యవస్థలే కుప్పకూలిపోతున్నాయి. అప్పుల కోసం అందరూ అర్రులు చాస్తున్న పరిస్థితి. డబ్బులున్న మహారాజులదే ఇప్పుడు రాజ్యం.. అప్పులపాలైన వారంతా ఇప్పుడు ఆస్తులు తెగనమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రి కూడా విక్రయానికి సిద్ధమైంది.దానికి ఆర్థిక ఇబ్బందులా? లేక నిర్వహణ చేయలేక అమ్ముకుంటున్నారో తెలియదు కానీ.. మొత్తానికి 5వేల కోట్లకు పైగా రేటుకు అమ్మడానికి సిద్ధమైనట్లు సమాచారం.

    aig Hospitals

    హైదరాబాద్ లోని ఏఐజీ (ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) హాస్పిటల్స్ లో మెజారిటీ వాటాను ప్రమోటర్లు అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఈ హాస్పిటల్స్ ను ప్రమోట్ చేసిన నాగేశ్వర్ రెడ్డి, ప్రస్తుత షేర్ హోల్డర్ అయిన క్వాడ్రియా క్యాపిటల్ లు కలిసి ప్రధాన వాటాను అమ్ముతున్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    1100 పడకల సామర్థ్యం గల రెండు హాస్పిటల్స్ కలిగిన ఏఐజీ విక్రయానికి అంతర్జాతీయ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ గోల్డ్ మాన్ సాచ్స్ ను నియమించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏఐజీలో క్వాడియా క్యాపిటల్ కు 30శాతం వాటా ఉంది. ప్రమోటర్ల వద్ద మిగిలిన వాటా ఉంది. వారు ఇరువురూ కలిసి 60-70 శాతం మెజారిటీ వద్ద మిగిలిన వాటా విక్రయించడానికి సిద్ధమయ్యారు. ఈ డీల్ విలువ రూ.4500-5000 కోట్లు ఉండవచ్చని అంచనా..

    ప్రమోటర్లు 30-40శాతం వాటాను ఆఫ్ లోడ్ చేస్తారని లావాదేవీని చూస్తున్న వారు వెల్లడించారు. ఈ అమ్మకానికి సంబంధించి వచ్చే 10 రోజుల్లో బిడ్స్ అందవచ్చని భావిస్తున్నారు. ఈ విక్రయ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న గోల్డ్ మాన్ సాచ్స్ కొద్దిరోజులుగా పలు ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఫండ్స్ ను సంప్రదిస్తున్నది. ఇప్పటికే కార్లే, టీపీజీ, బేరింగ్ పీఈ ఆసియాలతో సహా పెద్ద పీఈ ఫండ్స్ తోనూ సంప్రదింపులు జరిపిందని సమాచారం.

    రూ.2200 కోట్ల టర్నోవర్
    1986లో ఏర్పాటైన ఏఐజీ ఆసియాలోనే అతిపెద్ద గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ గా పేరొందింది. దీనికి ప్రస్తుతం గచ్చిబౌలిలో 800 పడకలు గల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సోమాజిగూడలో 300 పడకలతో ఒక హాస్పిటల్ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.2200 కోట్ల టర్నోవర్ పై రూ.300 కోట్ల ఆపరేటింగ్ లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా..

    -ఏఐజీలో వాటా కొన్న క్వాడ్రియా
    ఆసియా పసిఫిక్ లో పెట్టుబడులను పెట్టే పీఈ ఫండ్ క్వాడ్రియా క్యాపిటల్ ఏఐజీ హాస్పిటల్స్ లో 2014లో 16శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2019లో మరో ఫండ్ సమారా క్యాపిటల్ నుంచి 14 శాతం ఏఐజీ వాటాను రూ.300 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో ఈ హాస్పిటల్ లో క్వాడ్రియా వాటా ఏకంగా 30శాతానికి పెరిగింది. భారత్ లో హాస్పిటల్స్ రంగంలో ఈ ఫండ్ పెట్టుబడులు అధికం.

    Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. టెక్ మహీంద్రాలో జాబ్స్.. మంచి జీతంతో?

    ఏఐజీలోనే కాదు.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ హాస్పిటల్స్ కిమ్స్, బెంగళురుకు చెందిన ఆంకాలజీ హాస్పిటల్ చైన్ హెల్త్ కేర్ గ్లోబల్ లోనూ క్వాడ్రియా క్యాపిటల్ పెట్టుబడులు పెట్టడం విశేషం.

    క్వాడ్రియా చేతిలో ఇప్పుడు ఏఐజీ హాస్పిటల్స్ లో 30శాతం వాటా ఉంది. మిగతా 70శాతం ప్రమోటర్ల చేతుల్లో ఉంది. ప్రమోటర్లు, క్వాడ్రియా క్యాపిటల్ కలిసి 60-70శాతం వాటా విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమోటర్లు 30-40శాతం వరకూ వాటాలను ఉపసంహరించుకోనున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఏఐజీ నుంచి క్వాడ్రియా పూర్తిగా వైదొలిగే అవకాశం కనిపిస్తోంది. మరో 10 రోజుల్లో బిడ్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి.

    Also Read: ఇంట్లో దోమల కాయిల్స్ ను వెలిగించే వాళ్లకు షాకింగ్ న్యూస్!