Tollywood Stars: టాలీవుడ్ లో పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతుంది. ఎన్టీఆర్ నుండి నాని వరకు… స్టార్డం, మార్కెట్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ప్రభాస్ చూపించిన మార్గంలో సవారీ చేయాలని ఆశపడుతున్నారు. మరి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగితే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. కనీసం సినిమాకు రూ. వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవచ్చు. మరో పక్క ప్రభాస్ రూ. 150 కోట్లు తీసుకుంటుండగా… మిగతా స్టార్స్ కూడా టెంప్ట్ అవుతున్నారు.
అయితే పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం అనుకున్నంత ఈజీ కాదు. చిరంజీవి, నాగార్జున, వెంకీ ఇప్పటికే అక్కడ అదృష్టం పరీక్షించుకున్నారు. టాలీవుడ్ ని తిరుగులేని రారాజుగా ఏలిన చిరంజీవికి సైతం ఇది సాధ్యం కాలేదు. కోలీవుడ్ నుండి రజినీకాంత్ మాత్రమే పాన్ ఇండియా హీరోగా బాలీవుడ్ లో మార్కెట్ సాధించారు. ఆ తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్ లో సక్సెస్ అయిన చేసిన హీరో ప్రభాస్ మాత్రమే.అక్కడ భారీ కలెక్షన్స్ సాధించిన హీరోలలో జాబితాలో ప్రభాస్, రజినీ పోటీపడుతున్నారు.
కాగా పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలనుకుంటున్న మన హీరోలకు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. పలు భాషల్లో విడుదలయ్యే పాన్ ఇండియా చిత్రాన్ని ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో స్థానిక మీడియాతో మాట్లాడడం హీరోలకు ఇబ్బందిగా మారింది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఎన్టీఆర్, చరణ్ ఇదే సమస్యతో ఇబ్బంది పడ్డారు. అయితే చాలా వరకు మేనేజ్ చేశారు. దాదాపు ఇద్దరూ ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఎన్టీఆర్ కి కన్నడలో ప్రావీణ్యం ఉండగా.. అక్కడ మీడియాతో ఆయన చురుకుగా కలిసిపోయారు. హిందీ, తమిళ్, మలయాళ మీడియాతో ఆయన పూర్తిగా ఇంగ్లీష్ లో మాట్లాడారు.
Also Read: Pushpa Telugu Movie Review: ‘పుష్ప- ది రైజ్’ రివ్యూ
ఇక చరణ్ తమిళ్ లిటిల్ బిట్ మేనేజ్ చేశారు. ఆయన కూడా ఇతర భాషల మీడియాతో ఇంగ్లీష్ లో మాట్లాడం జరిగింది. రాజమౌళి.. కన్నడలో అల్లాడించగా.. మిగతా భాషల మీడియాతో ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఏమైనా స్థానిక భాషలో మాట్లాడం వలన వచ్చే గుర్తింపు వేరు. మనవాడు అనే ఫీలింగ్ స్థానిక భాష తీసుకువస్తుంది. అలాగే చెప్పాలనుకున్న విషయం సూటిగా సామాన్యుల వరకు చేరుతుంది. కాబట్టి పాన్ ఇండియా స్టార్స్ కావాలనుకుంటున్న మన హీరోలకు ఉండాల్సిన మొదటి క్వాలిటీ.. ప్రధానమైన ఈ ఐదు భాషల్లో ప్రావీణ్యం సాధించడమే. కొందరు హీరోలు ఇప్పటికే ఏ దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం.
Also Read: Pushpa: స్పైడర్ మ్యాన్ సినిమాపై పుష్పరాజ్ ఏమన్నారంటే?