Unified Lending Interface : మనీ ట్రాన్స్ ఫర్ కోసం రకరకాల యాప్ లను వాడుతూ ఉంటాం. మొబైల్ ద్వారానే పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తూ ఉంటాం. ఒకరి ద్వారా మరొకరికి డబ్బు చెల్లించడానికి UPI(United Payment Interface) పని చేస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ లేదా దీని నెంబర్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ అవుతుంది. అయితే ఇప్పుడు యూపీఐ లాగే ULI అందుబాటులోకి రాబోతుంది. ULI (United Lending Interface) ద్వారా చాలా ఈజీగా లోన్ తీసుకోవచ్చు. ఒకప్పుడు లోన్ తీసుకోవాలంటే రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అన్నీ ఉన్నా కొన్ని బ్యాంకులు ఏదో ఒక పత్రం లేదని రుణాన్ని రిజెక్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు క్షణాల్లోనే యూఎల్ఐ ద్వారా డబ్బు బ్యాంకు అకౌంట్ లో పడిపోతుంది. అదెలాగా అంటే?
కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కటీ డిజిటల్ అయిపోతుంది. ఏ పని చేయాలన్నా టెక్నాలజీని కచ్చితంగా వినియోగించుకుంటున్నారు. బ్యాంకు వ్యవహారం మొత్తం ఆన్ లైన్ లోకి మారిపోయింది. సామాన్యు నుంచి బడా వ్యాపారుల వరకు మొబైల్ ద్వారానే మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు కు సంబంధించిన సమస్యల పరిష్కారానిక ఆన్ లైన్ పైనే ఆధారపడుతున్నారు.
ఇప్పటి నుంచి లోన్ కోసం కూడా బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. ఒకప్పుడు ఏదైనా రుణం కావాలంటే బ్యాంకులు చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ కొందరికి మాత్రమే రుణం మంజూరయ్యేది. కానీ ఇప్పుడు ఆన్ లైన్ లోనే కావాల్సిన రుణం అందిస్తున్నారు. ఇందు కోసం ULI ని ఉపయోగించనున్నారు. యూఎస్ఐ యాప్ కిందకు అన్ని బ్యాంకులు చేరనున్నాయి. బ్యాంకు వినియోగదారులు ఎవరైనా రుణం కావాలంటే సంబంధిత బ్యాంకును సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే బ్యాంకును సెలెక్ట్ చేసుకున్న తరువాత ఖాతాదారుడి డిటేయిల్స్ బ్యాంకుకు ఎలా తెలుస్తాయనే సందేహం రావొచ్చు. అయితే బ్యాంకును సెలెక్ట్ చేసుకున్న తరువాత అప్పుడు Allow Permission అనే ఆప్షన్ వస్తుంది. ఈ సమయంలో ఓకే చెప్పడం ద్వారా ఒక ఓటీపీ వస్తుంది. ఆ తరువాత మీ డిటేయిల్స్ సదరు బ్యాంకుకు తెలిసిపోతాయి. అప్పుడు మీ వివరాలు వారు తెలుసుకొని రుణం ఇవ్వాలా? లేదా? అనేది డిజైడ్ చేస్తారు. ఇదే సమయంలో ఆధార్ కార్డు, పాన్ కార్డుతో పాటు సిబిల్ స్కోర్ గురించి కూడా తెలుసుకుంటారు.
ఇప్పటికే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఆన్ లైన్ ద్వారా లోన్ ఇస్తున్నారు. కానీ వీటిపై అధిక వడ్డీ భారం మోయడంతో వినియోగదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పడు బ్యాంకులు ఒకే వేదికపైకి వచ్చి ఇలా రుణం ఇవ్వడం ద్వారా ఖాతాదారులకు చేరువలో ఉన్నట్లుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతా దాస్ గత ఆగస్టు 26న తెలిపారు. కేంద్ర బ్యాంకు యూఎస్ఐ కింద ఫైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేశామని, ఇది సక్సెస్ అయితే అన్ని బ్యాంకులకు వర్తింప చేస్తామన్ని అన్నారు.