Small Business Loan India: కొందరికి ఉద్యోగం చేయడం ఆసక్తి ఉంటే.. మరికొందరు వ్యాపారం చేయాలని ఉత్సాహం చూపిస్తుంటారు. ఇందుకోసం చిన్నప్పటి నుంచే మెలకువలు నేర్చుకుంటూ వ్యాపారంలో రాణిస్తారు. అయితే మరికొందరికి వ్యాపారం చేయాలని ఆసక్తి ఉన్నా.. సరైన ఆదాయం ఉండదు. అయితే ఇతరుల వద్ద అప్పు చేసి వ్యాపారం చేస్తే వాటిపై వడ్డీ భారం పెరుగుతుంది. అయితే ఇలాంటి వారి కి ఆర్థిక సహాయం గా కేంద్ర ప్రభుత్వం ఆ పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారితోపాటు.. ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇలా రూ.2 లక్షల నుంచి.. రూ. 20 లక్షల వరకు రుణం ఇవ్వనుంది. తక్కువ వడ్డీతో ఈ రుణంను తీర్చుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ పథకం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలుసా ?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేరు ప్రధానమంత్రి ముద్ర యువజన. భారతీయ పౌరులై ఉండి వ్యాపారం చేయాలని అనుకునే వారికి ఈ పథకం సౌకర్యవంతంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు.. వ్యాపార విస్తరణకు ఈ పథకం కింద కావాల్సిన లోన్లు తీసుకోవచ్చు. వర్తకం, సేవా రంగాలకు చెందిన వారు ఆయా ఫైనాన్స్ సంస్థల నుంచి ఈ లోను పొందవచ్చు.
ముద్ర లోన్ మూడు విధాలుగా అందించబడుతుంది. ఒకటి శిశు లోన్. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు తీసుకునే లోన్ ను శిశు లోన్ అంటారు. వీరు ప్రారంభించే వ్యాపారాన్ని బట్టి రుణమును అందిస్తారు. ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి తీసుకునే రుణమును కిషోర్ లోన్ అని అంటారు. వీరు తమ వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నారో సంబంధిత వివరాలను అందిస్తే రుణమును మంది మంజూరు చేస్తారు. ఇప్పటికే ఉన్న వ్యాపారస్తులకు పలు కారణాలవల్ల అందించే లోను ను తరుణ్ లోన్ అని అంటారు. ఈ లోన్ ద్వారా వారు ఇతర అవసరాలకు కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. కంపెనీ స్థాయిలో ఉండే వారికి ఇలాంటి లోన్ ను అందిస్తారు.
Also Read: ఫోన్ పే, గూగుల్ పే లోకి వచ్చే గిఫ్ట్ కార్డులను విక్రయించుకోవచ్చు.. ఎలాగో చూడండి..
ముద్ర లోన్ తీసుకునే వారికి తక్కువ వాటిని విధిస్తారు. ప్రస్తుతం ముద్ర లోన్ తీసుకుంటే 9.30 వడ్డీ రేటును విధించే అవకాశం ఉంది. అయితే ఇది పరిస్థితులను బట్టి మారే అవకాశం కూడా ఉంటుంది. ముద్ర లోన్ తీసుకోవాలని అనుకునేవారు సంబంధించిన పత్రాలను సమర్పించాలి. వ్యాపారానికి సంబంధించిన ప్రణాళిక పత్రంతోపాటు.. ఆధార్ కార్డు, చిరునామా, బ్యాంకు ఖాతా వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది. ఈ ముద్ర లోన్ కావాలని అనుకునేవారు సంబంధిత బ్యాంకు సిబ్బందిని సంప్రదించాలి. లేదా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని అనుకునేవారు www.udaymitra.in అనే పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అలాగేwww.mudra.org.in అనే వెబ్సైట్లోకి వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ లోన్ తీసుకున్న తర్వాత ఒకటి నుంచి ఏడు సంవత్సరాల లోపు తిరిగి చెల్లించాలి.