UPI Gift Cards: మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ నేటి కాలంలో ఆర్థిక వ్యవహారాలన్నీ ఆన్లైన్ లోనే జరిపిస్తున్నారు. కూరగాయల మార్కెట్ నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వారు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలా మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు గూగుల్ పే లేదా ఫోన్ పే కి కొన్ని గిఫ్ట్ కార్డ్స్ వస్తుంటాయి. మరికొందరికి క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు సంతోషంగానే ఉంటుంది. కానీ గిఫ్ట్ ప్యాక్ వచ్చినప్పుడు వాటిని ఎలా యూస్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. దీంతో వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. అవి కొన్నాళ్లపాటు అలాగే ఉండి ఎక్స్పైరీ డేట్ అయిపోతాయి. కానీ వీటితో కూడా డబ్బులు సంపాదించవచ్చు అనే విషయం తెలుసా?
Also Read: ఆగస్ట్ 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్.. ఆ టైంలోనే చేయాలట
మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వచ్చే గిఫ్ట్ కార్డులతో కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఏదైనా యాప్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇలాంటి గిఫ్ట్ కార్డులు వస్తే వాటిని రీ సేల్ చేసి కనీసం 50% అయినా డబ్బులు రికవరీ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ప్రముఖ కంపెనీ నుంచి గిఫ్ట్ కార్డు వస్తే.. దానిని మళ్లీ విక్రయించాలి. ఇలా విక్రయించడం వల్ల వాళ్లు నిర్ణయించిన శాతం వరకు డబ్బును అందిస్తారు. మరి ఇలాంటి గిఫ్ట్ కార్డును ఎలా విక్రయించాలి?
Google లోకి వెళ్లి Sell Gift Card అని టైప్ చేయాలి. ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు డిస్ప్లే అవుతాయి. వీటిలో Crafin అనే వెబ్సైటు ఓపెన్ చేయాలి. ఇందులో గిఫ్ట్ కార్డుకు సంబంధించిన వివరాలు అడుగుతారు. ఈ వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత రెండు రోజుల్లో డబ్బులు పంపిస్తారు. అయితే ప్రతి ఒక్క గిఫ్ట్ కార్డును అమ్మడానికి అవకాశం ఉండదు. కొన్ని బ్రాండెడ్ కంపెనీలకు చెందినవి మాత్రమే విక్రయించవచ్చు. వీటి ద్వారా ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఈ యాప్ ముందే తెలుపుతుంది. అయితే డబ్బులు అకౌంట్ లో పడడానికి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read: HDFC క్రెడిట్ కార్డ్ ఉన్న వారందరికీ ఇదీ షాకింగ్ న్యూస్..
ఇకనుంచి అయినా మనీ ట్రాన్స్ఫర్ యాప్ కు ఏదైనా గిఫ్ట్ కార్డు వచ్చినప్పుడు దానిని వృధా చేయకుండా ఇలా విక్రయించి డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. చాలామంది ఫోన్ పే లేదా గూగుల్ పే యాప్ లకు వచ్చే డిస్కౌంట్ కార్డులను కూడా విక్రయించాలని అనుకుంటారు. కానీ కేవలం గిఫ్ట్ కార్డులను మాత్రమే విక్రయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని కంపెనీలు మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు గిఫ్ట్ కార్డులను అందిస్తూ ఉంటాయి. వీటిని మాత్రమే విక్రయించుకోవాలి. మిగతా వాటికి ఆ అవకాశం లేదు.
ఇవే కాకుండా గూగుల్ పే వంటి కొన్ని యాప్లు ఒక్కోసారి భారీ మొత్తంలో క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నాయి. ఈ విధంగా గిఫ్ట్ కార్డులను ఎక్స్పైర్ కాకుండా వెంటనే వాటిని విక్రయించి డబ్బును పొందుతూ ఉండండి.