Mutual Fund: మనలో చాలామంది డబ్బులను పొదుపు చేయడానికి వేర్వేరు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందనే సంగతి తెలిసిందే. మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ రూపంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఊహించని స్థాయిలో లాభాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
కనీసం 500 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఈక్విటీ ఫండ్స్ ను ఎంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ కూడా ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. రిస్క్ కు సిద్ధపడి డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకుంటే మంచిది.
సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ లేదా మ్యూచువల్ ఫండ్ ఏజెంట్లను సంప్రదించి మ్యూచువల్ ఫండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం వల్ల ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది.