Chandrababu Naidu: కేంద్రం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చడానికి సంకల్పించింది. ఇందులో భాగంగా ఏపీకి రావాల్సిన న్యాయమైన హక్కులు ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. ఇన్నాళ్లు ఏపీకి రావాల్సిన నిధులపై సీఎం జగన్ ఎన్నోమార్లు కేంద్రాన్ని కోరారు. దీనిపై ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వచ్చిన ప్రభుత్వం పార్లమెంట్ లోప్రధాని ప్రసంగం నేపథ్యంలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే పనిలో పడింది. ఇప్పటికే టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావించింది. దీంతో టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని ప్రణాళిక రచిస్తోంది. దీని కోసమే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలని చూస్తోంది.
మొదట తొమ్మిది అంశాలను చేర్చుతూ ఈనెల 17న సమావేశంలో చర్చించాలని భావించినా అందులో ఏపీకి ప్రత్యేక హోదాను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. ప్రత్యేక హోదా పక్కన పెట్టడంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు హస్తం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు కావాలనే ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టించారనే వాదన తెస్తున్నారు. దీంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి.
Also Read: అమెజాన్ ప్రైమ్ బంపర్ ఆఫర్.. 50 శాతం డిస్కౌంట్ తో సబ్ స్క్రిప్షన్ పొందే ఛాన్స్?
చంద్రబాబుకు నమ్మిన బంట్లు బీజేపీలో ఉన్నారని చెబుతున్నారు. వారే సుజనా చౌదరి, సీఎం రమేష్, జీవిఎల్ నరసింహారావు అని తెలిపారు. వారి ప్రోద్బలంతోనే బాబు ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించారని వివరిస్తున్నారు. సీఎం జగన్ ప్రత్యేక హోదా అంశంపైనే పలుమార్లు బీజేపీ పెద్దలతో చర్చించారని తెలుస్తోంది. అందుకే ప్రత్యేక అంశమే ప్రధాన ఎజెండాగా ఉండాల్సి ఉన్నా దాన్ని తీసివేయడంపై అందరిలో అనుమానాలు వస్తున్నాయి.
దీనిపై పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు సైతం వస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా అనేది గుండె కాయ లాంటిదని అందరి అభిప్రాయం. కానీ ప్రస్తుతం ఎజెండాలో దాన్ని లేకుండా చేయడంలో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు వైసీపీ చేస్తున్న కామెంట్లపైనా చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే చర్యలపై ఉపేక్షించేది లేదని చెబుతున్నారు. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా దానిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి టీఆర్ఎస్ చేసిన విమర్శలకు ధీటైన సమాధానం చెప్పేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ప్రధాని ప్రసంగాన్ని వక్రీకరించి తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్న టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని చూస్తోంది. దీంతోనే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను తీర్చాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: సోమావతి అమవాస్య రోజున ఈ పని చేస్తే జాతకంలో సమస్యలన్నీ తొలగిపోతాయా?