Abhinandan Varthaman: గత ఎన్నికల ముందు పాకిస్తాన్ తో జరిగిన వివాదాల్లో సర్జికల్ దాడులు ప్రధానమైనవి. పాకిస్తాన్ పీచమణచే క్రమంలో భారత్ తీసుకున్న నిర్ణయానికి యావత్ దేశం నీరాజనాలు పట్టింది. అంతకు ముందు పుల్వామా జిల్లాలో దాదాపు నలభై మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఇండియా కంకణం కట్టుకుంది. దీనికి ప్రత్యక్ష దాడులే పరిష్కారమని భావించింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న బాలాకోట్ ను గుర్తించి అక్కడ ఉన్న ఉగ్రవాదులను అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక రచించింది.
దీని కోసం ఫిబ్రవరి 27న రాత్రి ఒకేసారి దాడి చేసి ఉగ్రవాద మూలాలను దెబ్బతీసింది. ట్యాంకర్లను ధ్వంసం చేసి పాకిస్తాన్ కు సవాలు విసిరింది. దీంతో పాకిస్తాన్ ప్రతిగా భారత్ పై దాడి చేసేందుకు యత్నించింది. దీంతో నాకిస్తాన్ యుద్ధ విమానాలు ఎఫ్-16 విమానాలను ధ్వంసం చేసింది. ఇంకో విమానం ధ్వంసం చేసే క్రమంలో రాకెట్ తగిలి వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ కు పట్టుబట్టాడు దీంతో అతడిని విడిపించేందుకు ప్రధాని మోడీ పెద్ద కసరత్తు చేశారు.
Also Read: ప్రత్యేక హోదా పక్కన పెట్టడంలో చంద్రబాబు పాత్ర ఉందా?
అభినందన్ ను విడిపించాలని పాకిస్తాన్ కు హెచ్చరించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. దీంతో పాకిస్తాన్ అభినందన్ తో భారత్ ను ఇరుకున పెట్టి తమ డిమాండ్లు నెరవేర్చాలని చూసింది. కానీ ఇండియా మాత్రం వినిపించుకోలేదు. దీంతో అమెరికా కూడా కల్పించుకుని పాక్ యుద్ధ సన్నాహాలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బెదిరించింది. దీంతో పాక్ అధ్యక్షుడు దుబాయ్ వెళ్లి అక్కడి నుంచే టర్కీని సాయం కోరాడు. కానీ టర్కీ అమెరికాకు భయపడి చేయలేనని చేతులెత్తేసింది.
ఇదే క్రమంలో చైనాను కూడా సాయం కోసం అభ్యర్థించింది. మీరు మాకు సాయం చేస్తే ఇండియాతో యుద్ధం చేస్తామని కోరినా చైనా కూడా వెనుకంజ వేసింది. దీంతో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చైనా కల్పించుకోవద్దని సూచించింది. పాక్ ఏకాకి కావడంతో ఇక చేసేది లేక ఏం చేయలేక భారత్ కోరినట్లు అభినందన్ విడుదలకు అంగీకరించింది. ఒక వేళ ఏ దేశమైనా సాయం అందిస్తే పాకిస్తాన్ పన్నాగం వేరేలా ఉండేది.
దీంతో ఇండియా వ్యవహరించిన తీరుపై అప్పట్లో ప్రశంసల జల్లు కురిసింది. తమ జోలికి వస్తే ఖబడ్దార్ ఎంతకైనా తెగిస్తామని సవాలు చేసింది. దీంతోనే పాక్ పన్నాగాలు నిలువలేకపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏకాకిగా మిగిలిన పాక్ కు ఎవరు సాయం అందించేందుకు ఏ దేశం కూడా ముందుకు రాలేదు.అమెరికా కూడా ఈ విషయంలో పాక్ ను గట్టిగానే హెచ్చరించింది. ఏదైనా కుట్ర చేస్తే తరువాత సమాధానం చెప్పాల్సింది మీరే అని తెగేసి చెప్పడంతో పాక్ అంతర్జాతీయంగా ఒంటరైపోయింది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో భారత్ జరిపిన సర్జికల్ దాడితో ఉగ్రవాదులను చంపి వారికి ప్రతి సవాలు చేసి మనకు ఎదురే లేదని చెప్పింది. తమ జోలికి వస్తే ఎంతటి పరిణామాలు ఉంటాయో రుచి చూపించింది. అప్పట్లో పెను సంచలనం రేపిన సంఘటనపై అందరిలో ఆసక్తి నెలకొంది. పాక్ ను ఉగ్రవాద దేశంగా ముద్ర వేసి దాన్ని అంతర్జాతీయంగా కూడా విమర్శలు వచ్చేలా చేయడంలో విజయం సాధించింది.
Also Read: రాత్రిపూట నిద్ర రావడం లేదా.. ప్రాణాలకే ప్రమాదమంటున్న వైద్యులు!