వాట్సాప్ లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?

దేశంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల సంఖ్య సంవత్సరంసంవత్సరానికి పెరుగుతున్న సంగతి తెలిసిందే. చాలామంది కాల్ చేయడం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే వాట్సాప్ సహాయంతో సులభంగా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తమ కస్టమర్లకు సులభంగా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవాలని భావించే వాళ్లు 75888 88824 నంబర్ […]

Written By: Kusuma Aggunna, Updated On : June 25, 2021 3:17 pm
Follow us on

దేశంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల సంఖ్య సంవత్సరంసంవత్సరానికి పెరుగుతున్న సంగతి తెలిసిందే. చాలామంది కాల్ చేయడం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే వాట్సాప్ సహాయంతో సులభంగా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తమ కస్టమర్లకు సులభంగా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవాలని భావించే వాళ్లు 75888 88824 నంబర్ కు మెసేజ్ ను పంపాల్సి ఉంటుంది. అలా కాకుండా మిస్డ్ కాల్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవాలని భావించే వాళ్లు 84549 55555 నంబర్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్ల ద్వారా కాకుండా 7718955555 నంబర్ కు మెసేజ్ పంపించడం ద్వారా కూడా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

https://cx.indianoil.in వెబ్ సైట్ సహాయంతో కూడా గ్యాస్ సిలిండర్ ను సులభంగా బుకింగ్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఏ డిస్ట్రిబ్యూటర్ నుండి గ్యాస్ రీఫిల్ పొందాలో నిర్ణయించుకునే హక్కు కూడా ఉంది. రీఫిల్ బుకింగ్ పోర్టబిలిటీ ప్రస్తుతం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. చండీగడ్, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే రాంచీ ప్రజలకు మొదటి దశలో ఈ ప్రయోజనం లభిస్తోంది.

పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఇతర నగరాల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అదే ప్రాంతంలో పనిచేస్తున్న ఇతర పంపిణీదారులకు కనెక్షన్ ను ఆన్ లైన్ లో బదిలీ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇందుకోసం వెబ్ పోర్టల్‌తో పాటు వినియోగదారుల మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.