https://oktelugu.com/

రేషన్ కార్డులో రకాలివే.. ఏ కార్డు వల్ల ఎలాంటి ప్రయోజనాలంటే..?

దేశంలోని ప్రజలకు రేషన్ కార్డ్ ఎంత ముఖ్యమైన కార్డు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు తీసుకోవడం వల్ల రేషన్ సరుకులు తక్కువ ధరకే లభించడంతో పాటు పలు పథకాలకు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మాదిరిగా దేశంలోని ప్రజలకు ముఖ్యమైన డాక్యుమెంట్లలో రేషన్ కార్డు కూడా ఒకటిగా ఉంది. రేషన్ కార్డులో వేర్వేరు రకాలు ఉన్నాయి. నేషనల్ ఫుడ్ అండ్ సెక్యూరిటీస్ యాక్ట్ […]

Written By: Kusuma Aggunna, Updated On : June 25, 2021 3:20 pm
Follow us on

దేశంలోని ప్రజలకు రేషన్ కార్డ్ ఎంత ముఖ్యమైన కార్డు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు తీసుకోవడం వల్ల రేషన్ సరుకులు తక్కువ ధరకే లభించడంతో పాటు పలు పథకాలకు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మాదిరిగా దేశంలోని ప్రజలకు ముఖ్యమైన డాక్యుమెంట్లలో రేషన్ కార్డు కూడా ఒకటిగా ఉంది. రేషన్ కార్డులో వేర్వేరు రకాలు ఉన్నాయి.

నేషనల్ ఫుడ్ అండ్ సెక్యూరిటీస్ యాక్ట్ 2013 సంవత్సరంలో అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నేషనల్ ఫుడ్ అండ్ సెక్యూరిటీస్ యాక్ట్ రెండు రకాల రేషన్ కార్డులను జారీ చేస్తుండగా ఈ కార్డులలో అంత్యోదయ రేషన్ కార్డు, ప్రియారిటీ హౌస్‌హోల్డ్ రేషన్ కార్డు ఉంటాయి. రేషన్ కార్డును బట్టి కార్డుకు పొందే ప్రయోజనాలలో సైతం స్వల్పంగా మార్పులు ఉంటాయి. అర్హతల ప్రాతిపదికన కార్డు లభించడం జరుగుతుంది.

వికలాంగులు, వితంతువులకు, సీనియర్ సిటిజన్స్ కు అంత్యోదయ రేషన్ కార్డులను అందజేస్తారు. ఈ కార్డు ఉన్న కుటుంబాలు నెలకు 35 కేజీల రేషన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ కార్డు లేనివాళ్లకు ప్రియారిటీ హౌస్ హోల్డ్ రేషన్ కార్డును ఇస్తారు. ఈ కార్డును కలిగి ఉన్నవాళ్లకు నెలకు 5 కేజీల చొప్పున బియ్యం లభిస్తుంది. ఈ విధానం అమలులోకి రాకముందు ఏపీఎల్ రేషన్ కార్డు, బీపీఎల్ రేషన్ కార్డు, అన్నపూర్ణ రేషన్ కార్డులు ఉండేవి.

దారిద్య్ర రేఖ కన్నా ఎక్కువ ఆదాయం కలిగిన వారికి ఏపీఎల్ రేషన్ కార్డును, దారిద్య్ర రేఖ కన్నా తక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారికి బీపీఎల్ రేషన్ కార్డును మంజూరు చేసేవారు. ఎవరైతే ఈ రేషన్ కార్డును కలిగి ఉంటారో వాళ్లు 10 నుంచి 20 కేజీల రేషన్ 50 శాతం సబ్సిడీ రేటుకు పొందేవారు. పేదలు, 65 ఏళ్లకు పైన వయసు కలిగిన వారికి అన్నపూర్ణ రేషన్ కార్డులు ఉండేవి. రాష్ట్రాన్ని బట్టి ఈ కార్డు ద్వారా పొందే ప్రయోజనాలలో స్వల్పంగా మార్పులు ఉండేవి.