దీంతో దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ప్రజల హక్కులు, విధులు హరించబడ్డాయి. ఏ రకమైన సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. 1975 నుంచి 1977 వరకు 21 మాసాలు దాదాపు రెండేళ్లు దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్352 మేరకు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు నాటి రాష్ర్టపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1975 జూన్ 25న ఆదేశాలు జారీ చేశారు.
1977 మార్చి 21న ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ కాలం చీకటి రోజులుగా మిగిలిపోయింది. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేసిన ఎందరో జైళ్లకు వెళ్లారు.ఎక్కడికక్కడ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. అణిచివేత ప్రధానంగా యంత్రాంగం కదిలింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేపట్టకుండా కట్టడి చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీతో దేశ ప్రజాస్వామ్యనీతిని కాంగ్రెస్ కాలరాసిందంటూ విమర్శించారు.నాటి చీకటి రోజులను ఇప్పటికి మరచిపోలేకపోతున్నామని పేర్కొన్నారు. 1975-1977 మధ్య కాలంలో దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని తెలిపారు. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు రాజ్యాంగ విలువలను పెంపొందించేందుకు కంకణబద్దులు కావాలని పిలుపునచ్చారు.