ఆధార్ కార్డు ద్వారా ఎటువంటి పూచీకత్తు లేకుండా సులభంగా రుణం పొందే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం. ఆధార్ కార్డ్ తో పాటు పాన్ కార్డ్ తో కూడా సులభంగా రుణం పొందే అవకాశాలు ఉంటాయి. కస్టమర్ అర్హతను తెలుసుకోవడం కోసం ప్రతి బ్యాంక్ కొన్ని పత్రాలను అడుగుతుందనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ మనకు ఎంతో అవసరమైన కేవైసీ డాక్యుమెంట్లలో ఒకటని చెప్పవచ్చు.
భారతీయ పౌరుడు కావడంతో పాటు 23 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ లేదా ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలలో పని చేస్తూ మంచి క్రెడిట్ స్కోర్ ను కలిగి ఉన్నవాళ్లు లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది.
పర్సనల్ లోన్ మీద క్లిక్ చేసి లోన్ ఆప్షన్ ను ఎంచుకుని రుణం తీసుకోవడానికి అర్హులో కాదో తెలుసుకోవచ్చు. అర్హత ఉంటే ఆన్ లైన్ అప్లికేషన్ ను నింపి ఆ తర్వాత ఆధార్ కార్డు కాపీని అప్‌లోడ్ చేసి సులభంగా లోన్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి.